మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Dec 10, 2020 , 03:33:48

దాడి చేసిన వారిని శిక్షించాలి

దాడి చేసిన వారిని శిక్షించాలి

  •  మున్సిపల్‌ కార్మికుల డిమాండ్‌
  •  అదనపు కలెక్టర్‌,సీఐ హామీతో విరమణ

మంచిర్యాలటౌన్‌: మున్సిపల్‌ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, జవాన్లపై దాడికి పాల్పడిన వ్యాపారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం కార్మికులు సమ్మెకు దిగారు. మూడు రోజుల క్రితం పట్టణంలో ప్లాస్టిక్‌ కలిగి ఉన్న దుకాణాల్లో  తనిఖీ నిర్వహించి, పలువురికి జరిమానా విధించారు. ఈ క్రమంలో శ్రీనివా స టాకీస్‌ రోడ్డులో ఉన్న మహాలక్ష్మి ప్లాస్టిక్‌ ట్రేడర్స్‌లో ప్లాస్టిక్‌ నిల్వలు గుర్తించిన సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్యాం సుం దర్‌కు సమాచారం ఇచ్చారు.  ఆయన వెంటనే జవాన్లు కుంటాల రాజలింగు, నారాయణ, ఇతర సి బ్బందితో కలిసి దుకాణానికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వ్యాపారి ద్వారక ఇన్నాని(కాలూ), అతడి బంధువులు సిబ్బందిపై దాడి చేశారు. ఈ విషయమై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ద్వారకా ఇన్నానిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్‌ చే యాలని కార్మికులు సమ్మెకు దిగారు. విషయం తెలుసుకున్న అడిషనల్‌ కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, కమిషనర్‌ స్వరూపారాణి అక్కడికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇ చ్చారు. నిందితులను అరెస్ట్‌ చేస్తామని సీఐ ముత్తి లిం గయ్య చెప్పడంతో కార్మికులు ఆందోళన విరమించారు.