మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Dec 09, 2020 , 02:20:00

కేంద్రంపై కన్నెర్ర

కేంద్రంపై కన్నెర్ర

  • రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ చేపట్టిన బంద్‌ విజయవంతం 
  • పలు చోట్ల టీఆర్‌ఎస్‌ నేతల ధర్నా 
  • పాల్గొన్న విప్‌ సుమన్‌, ఎమ్మెల్సీ పురాణం, ఎమ్మెల్యే దివాకర్‌రావు, జడ్పీ చైర్‌ పర్సన్‌

మంచిర్యాలటౌన్‌ : కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను నిరసిస్తూ మంగళవారం తలపెట్టిన భారత్‌బంద్‌ మంచిర్యాలలో విజయవంతమైంది. వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు  బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు, స్వచ్ఛందంగా బంద్‌ పా టించారు. ఆర్టీసీ కార్మికులు బంద్‌లో పాల్గొన్నా రు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకులు నిరసన చేపట్టారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్‌ ర్యాలీని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ప్రారంభించారు. అనంతరం ఐబీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. అక్కడే మానవహారం నిర్వహించారు. ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  కేంద్రం ఇకనైనా వ్యవసాయ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజ య్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌గౌడ్‌, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, కౌన్సిలర్లు సుదమల్ల హరికృష్ణ, నల్ల శంకర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు అత్తి సరోజ, గరిగంటి సరో జ, గొంగళ్ల శంకర్‌, గోగుల రవీందర్‌రెడ్డి, బుద్దార్థి రాంచందర్‌, కార్కూరి చంద్రమౌళి, పల్లె భూమే శ్‌, పెండ్లి అంజయ్య, పల్లపు తిరుపతి, జగన్‌, కొం డాల్‌రావు, గడప రాకేశ్‌, బింగి ప్రవీణ్‌ పాల్గొన్నా రు. కాగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. ఎడ్లబండ్ల ప్రదర్శన నిర్వహించారు. నాయకులు అంకం నరేశ్‌, చిట్ల సత్యనారాయణ, పూదరి తిరుపతి, అర్కల హేమలత, బానే శ్‌, అబ్దుల్‌ సత్తార్‌, పెంట రజిత, చల్ల మహేశ్‌, మోతెసుజాత, ప్రకాశ్‌నాయక్‌, కొండ శేఖర్‌, నాంపల్లి శ్రీనివాస్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

చెన్నూర్‌ : బంద్‌కు టీఆర్‌ఎస్‌తో పాటు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ సంఘాలు పూర్తి మద్ద తు తెలిపాయి. వ్యాపారులు దుకాణాలు మూసి ఉంచారు. బస్టాండ్‌ జనం లేక వెల వెలబోయింది. అనంతరం టీఆర్‌ఎస్‌ నాయకులు అనంతరం జైపూర్‌ మండలం ఇందారం క్రాస్‌ రోడ్డు వద్ద జరిగిన రాస్తారోకోలో పాల్గొన్నారు. 

లక్షెట్టిపేట రూరల్‌ : టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎడ్లబండి ర్యాలీ నిర్వహించారు. ఇందులో మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఉత్కూర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. వామపక్ష పార్టీలు, వివిధ ప్రజా సంఘాలు అంబేద్కర్‌ చౌరస్తాలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మను  దహనం చేశారు. మున్సిపల్‌ చైర్మ న్‌ నల్మాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, అంకతి రమేశ్‌, జగన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, తిరుపతి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ నాయకులు చెల్ల నాగభూషణం, చింత అశోక్‌, ఆరిఫ్‌, రమేశ్‌, రాందేని వెంకటేశ్‌, నాయకులు దొండ ప్రభాకర్‌, రాచర్ల రవికిరణ్‌, రమణా రెడ్డి, కనిగరపు అశోక్‌, రంజిత్‌ కుమార్‌, బైరం లింగన్న పాల్గొన్నారు.

కోటపల్లి : మండల కేంద్రంలో నిర్వహించిన బంద్‌లో ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకు లు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ దుకాణాలను మూసి వేయించారు. కేంద్ర ప్రభు త్వ చట్టాలను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. నాయకులు ఇందారం ధర్నాకు బయలుదేరగా ఎమ్మెల్సీ జెండా ఊపి ప్రారంభించారు. పీఏసీఎస్‌ చైర్మన్‌ సాంబాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు బైస ప్రభాకర్‌, నియోకవర్గ కోఆర్డినేటర్‌ ముల్కల్ల శశిపాల్‌ రెడ్డి, సర్పంచ్‌ గట్టు లక్ష్మణ్‌ గౌడ్‌, జెల్ల సతీశ్‌, అక్కల మధూకర్‌, ఎంపీటీసీ జేక శేఖర్‌, ఉప సర్పంచ్‌ కొమిరెళ్లి విజయ్‌ నాయకులు గట్టాగౌడ్‌, మంత్రి రామయ్య, గోనె మోహన్‌ రెడ్డి,  సూరం సందీప్‌ రెడ్డి, రాళ్లబండి శ్రీనివాస్‌, బీ మల్లయ్య, రాగం స్వామి, అరవింద్‌, కొంకటి సుందర్‌, గారె రమేశ్‌, రాజమౌళి పాల్గొన్నారు. అలాగే మండల కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు కాట్రాల మల్లయ్య, సుఖేందర్‌, తాళ్ల బాపు, ఆరె వెంకటి, ఎన్నం భాస్కర్‌, తదితరులు పాల్గొన్నారు.

మందమర్రి రూరల్‌ : మందమర్రిలో నిరసన ర్యాలీలో జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్‌ నల్లాల ఓదెలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలన్నారు. పాత బస్టాండ్‌ నుంచి మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహిం చారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌) : టీఆర్‌ఎస్‌, టీబీజీకేఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు సీసీసీ కార్నర్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు వంగ తిరుపతి, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి, నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ తోట శ్రీనివాస్‌ పాల్గొన్నారు. రైతులు, రైతు బంధు సమితి అధ్యక్షుడు ఒడ్నాల రాజమల్లు ఆధ్వర్యంలో ఎడ్లబండ్లపై వచ్చి నిరసన తెలిపారు. శ్రీరాంపూర్‌, నస్పూర్‌ కాలనీ వరకు మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్‌ అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వానికి బంద్‌తో కనువిప్పు కలగాలన్నారు. టీబీజీకేఎస్‌ కేంధ్ర చర్చల ప్రతినిధులు ఏనుగు రవీందర్‌రెడ్డి, వీరభద్రయ్య, రీజియన్‌ కార్యదర్శి మల్లారెడ్డి, ఏరియా చర్చల ప్రతినిధి వెంగల కుమారస్వామి, తొంగళ రమేశ్‌, కౌన్సిలర్లు హైమద్‌, పంబాల గంగా ఎర్రయ్య, బండి పద్మ, కుర్మిళ్ల్ల అన్నపూర్నమోహన్‌, బోయ మల్లయ్య, మొగిళి, పూదరి కుమార్‌, చీడం మహేశ్‌, నాయకులు మల్లెత్తుల రాజేంద్రపాణి, గోపాల్‌రావు, వేల్పుల రాజే శ్‌, జగ్గయ్య, జక్కుల రాజేశం, ముత్తె రాజేశం, రామ య్య, భాగ్యలక్షి జనార్దన్‌, కాసీం పాల్గొన్నారు. అలాగే గనులపై ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాజీ సైదా, బ్రాంచ్‌ కార్యదర్శులు కొట్టె కిషన్‌రావు, ముస్కె సమ్మయ్య, సీపీఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, శంకర్‌రావు, కార్యదర్శి భీంరావు, జీవన్‌జోయెల్‌, సత్యనారా యణ పాల్గొన్నారు. సీపీఐ కార్యదర్శి జోగుల మల్లయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు భూపతి శ్రీనివాస్‌, నస్పూర్‌ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ సుర్మిళ్ల వేణు ఆధ్వర్యంలో రాస్తా రోకో చేశారు. మోటార్‌ సైకిల్‌ ర్యాలీ తీశారు. కౌన్సిలర్లు శ్రీపతి సుమతీ మల్లేశం, గెల్లు రజితా మల్లే శం, బొద్దున రాంమూర్తి, తెనుగు లావణ్య దేవేందర్‌, ఆడెపు శ్యామల, కార్యదర్శి పుట్ట యశోద, నాయకులు మల్లయ్య, లింగయ్య పాల్గొన్నారు. 

బెల్లంపల్లిటౌన్‌ : పట్టణంలోని బజార్‌, కాల్‌టెక్స్‌ ఏరియాల్లో దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. టీఆర్‌ఎస్‌, అఖిలపక్షం ఆధ్వర్యంలో కాల్‌టెక్స్‌ ఫ్లై ఓవర్‌ రాష్ట్రీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జక్కుల శ్వేత, వైస్‌ చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌, గడ్డం భీమాగౌడ్‌, జక్కుల శ్రీధర్‌, చిలుముల శంకర్‌, మణిరామ్‌సింగ్‌, రమణ, చాంద్‌పాషా పాల్గొన్నారు. 

హాజీపూర్‌ : మండల కేంద్రంలో బస్టాండ్‌ వద్ద జరిగిన ధర్నాలో ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొ న్నారు. ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత-శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ బేతు రమాదేవి-రవి, రైతు బంధు సమితి కన్వీనర్‌ పూస్కూరి శ్రీనివాస్‌రావు, టీఆర్‌ ఎస్‌ మండలాధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్‌, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సాగి వెంకటేశ్వర్‌రావు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌ : సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌, న్యూడెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో క్యాతనపల్లి ఎక్స్‌ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ధర్నా నిర్వ హించారు. అంతకు ముందు బైక్‌ ర్యాలీ నిర్వహిం చారు. నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్‌, పీ రఘునాథ్‌రెడ్డి, సాంబార్‌ వెంకటస్వామి, మేకల సురేందర్‌, రామడుగు లక్ష్మణ్‌, మిట్టపల్లి పౌల్‌, నక్క వెంకటస్వామి, గంగారెడ్డి, మామిడి గోపి, ఈరవేణి రవీందర్‌, గోపతి రాజయ్య, పల్లె రాజు, పనాస రాజు, తేజావత్‌ రాంబాబు, రాజయ్య, రాయమల్లు, వెంకటేశ్‌, ఐలయ్య పాల్గొన్నారు. 

తాండూర్‌ : తాండూర్‌ ఐబీలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎడ్ల బండ్ల ర్యాలీ తీశారు. రాష్ట్రీయ రహదారిపై ఆందోళన చేశారు. ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, జడ్పీటీసీ సాలిగామ బానయ్య, వైస్‌ ప్రెసిడెంట్‌ దాగాం నారాయణ, ఎంపీటీసీలు సిరంగి శంకర్‌, మొగిలి శంకర్‌, సూరం రవీందర్‌ రెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ నజ్జీఖాన్‌, తాండూర్‌ ఇన్‌చార్జి సర్పంచ్‌ పూదరి నవీన్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ చౌళ్ల సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు దత్తుమూర్తి, రైతు బంధు మం డలాధ్యక్షుడు దత్తాత్రేయరావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ భాస్కర్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ మండల అధ్య క్షుడు ఎండీ ఈసా, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ కడారి రత్నాకర్‌ రావు, సూరం దామోదర్‌రెడ్డి, కామని శ్రీనివాస్‌, నాయకులు మామిడాల రాజేశం, కొండు బానేశ్‌, దాగాం రాజారాం, దుర్గం నాన య్య, టీబీజీకేఎస్‌ ఏరియా ఉపాధ్యక్షుడు మల్రా జు శ్రీనివాసరావు ప్రకాశ్‌రావు, తదితరులు ఉన్నారు.

బెల్లంపల్లిరూరల్‌ : బంద్‌కు టీఆర్‌ఎస్‌ నాయకులు సంఘీభావం తెలిపారు. కిరాణ దుకాణా లు, వ్యాపార సముదాయాలను మూసివేయించారు. జడ్పీ వైస్‌ చైర్మన్‌ టీ సత్యనారాయణ, ఎంపీపీ జీ శ్రీనివాస్‌, వ్యవసాయ మార్కెట్‌ కమి టీ వైస్‌ చైర్మన్‌ ఎం రాజశేఖర్‌, సర్పంచ్‌లు రాయమల్లు, అశోక్‌గౌడ్‌, వెంకటేశ్‌, అశోక్‌గౌడ్‌, వెంకటేశ్వర్‌గౌడ్‌, శ్రీనివాస్‌, సురేశ్‌ ఉన్నారు.

దండేపల్లి : మండల కేంద్రంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాస్తా రోకో చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో తాళ్లపేట నుంచి ముత్యం పేట వరకు ట్రాక్టర్ల  ర్యాలీ నిర్వ హించారు. అనంతరం రాస్తారోకో చేశారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతు బంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య,  నడిపెల్లి ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌ రావు, లింగన్న, చుంచు శ్రీనివాస్‌, బండారి వెంకటేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు గడ్డం నాగరాణి, వెంకటేశ్వర్లు, తదిత రులు పాల్గొన్నారు. 

నెన్నెల : మండలంలో బంద్‌ సందర్భంగా దుకాణాలు మూసి ఉంచారు. నెన్నెలలో రాస్త్తారోకో నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అశోక్‌ గౌడ్‌, మసూద్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

వేమనపల్లి : మండల కేంద్రంలో దుకాణా సముదాయాలను సర్పంచ్‌ కుబిడె మధుకర్‌ ఆధ్వర్యంలో మూసివేయించారు. రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు తలండి భీమయ్య, శం కర్‌గౌడ్‌, ముజాహిద్‌ అలీ పాల్గొన్నారు. 

జన్నారం : అఖిలపక్షం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. వ్యాపార, వాణి జ్య సంస్థలు బంద్‌ పాటించాయి. ఎంపీపీ  మాదా డి సరోజన, వైస్‌ ఎంపీపీ సుతారి వినయ్‌ కుమా ర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సీపతి బుచ్చన్న, సీపీ ఎం అధ్యక్షుడు కే రాజన్న, నాయకులు ముత్యం రాజన్న, తోకల సురేశ్‌, గుర్రం మోహన్‌రెడ్డి, ఫసి ఉల్లా, బాలసాని శ్రీనివాస్‌గౌడ్‌,బాస్కర్‌గౌడ్‌, సర్పంచ్‌ జక్కు భూమేశ్‌, బోర్లకుంట ప్రభుదాస్‌, ఇందయ్య, ముత్యం సతీశ్‌, గోట్ల రాజేశ్‌యాదవ్‌, పోతు శంకర్‌, హజర్‌, రజాక్‌, శీలం రమేశ్‌, సులు వ జనార్దన్‌, తదితరులు పాల్గొన్నారు 

కాసిపేట : కాసిపేటలో టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయించారు. జడ్పీటీసీ పల్లె చంద్ర య్య, ఎంపీటీసీ అక్కెపల్లి లక్ష్మి, సర్పంచ్‌లు దేవి, బాదు. ఉప సర్పంచ్‌లు పిట్టల సుమన్‌, బోయిని తిరుపతి, సహకార చైర్మన్‌ నీలా రాంచందర్‌, అగ్గి సత్తయ్య, మోటూరి వేణు పాల్గొన్నారు. కొండాపూర్‌ యాపలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లు రమణారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎంపీ పీ రొడ్డ లక్ష్మి, రైతు బంధు సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, మడావి అనంతరావు, గడ్డం పురుషోత్తం, ఏనుగు తిరుపతి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రౌత్‌ సత్తయ్య, సర్పంచ్‌లు రాంటెంకి శ్రీనివాస్‌, సపాట్‌ శంకర్‌, ఆడె జంగు, అజ్మీర తిరుపతి, నాయకులు మదన్‌రావు, చింతల భీమ య్య, అలుగం సురేశ్‌, మాసు సుధాకర్‌ పాల్గొన్నా రు. సోమగూడెంలో సర్పంచ్‌  ప్రమీలాగౌడ్‌ ఆధ్వర్యంలో రహదారిపై రాస్తారోకో చేశారు. 

కన్నెపల్లి : ఏఐకేఎంఎస్‌ నాయకుల ఆధ్వర్యం లో భీమిని మండలం కర్జీభీంపూర్‌ గ్రామంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాబురావు, లస్మన్న, చంద్రన్న, రమేశ్‌, శంకర్‌, పోశం పాల్గొన్నారు.