మంగళవారం 26 జనవరి 2021
Mancherial - Dec 09, 2020 , 02:19:57

సింగరేణిలో జీఎంల బదిలీలు

 సింగరేణిలో జీఎంల బదిలీలు

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : సింగరేణి సంస్థలో యాజమాన్యం పలువురు జీఎంలను బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బెల్లంపల్లి ఏరియా జీఎం కే కొండయ్యను కొత్తగూడెం రీజియన్‌ జీఎం(సేఫ్టీ)గా, కార్పొరేట్‌ కార్యాలయంలో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఏ రమేశ్‌రావును కార్పొరేట్‌ కార్యాలయంలోనే జీఎం (మెటీరియల్‌ ప్రొక్యూర్‌మెంట్‌)గా, కొత్తగూడెం రీజియన్‌ జీఎం (సేఫ్టీ) బీ సంజీవరెడ్డిని బెల్లంపల్లి జనరల్‌ మేనేజర్‌గా బదిలీ చేశారు. పర్చేజ్‌ డిపార్ట్‌మెంట్‌లో జీఎంగా పనిచేస్తున్న కేవీ రమణమూర్తి ఈ నెల చివర్లో రిటైర్డ్‌ అవుతుండగా, ఆయన స్థానంలో రమేశ్‌రావు బాధ్యతలు తీసుకోనున్నారు.


logo