గురువారం 21 జనవరి 2021
Mancherial - Dec 07, 2020 , 01:51:47

ఆర్టీవోల బదిలీ

ఆర్టీవోల బదిలీ

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలువురు అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లకు ఎంవీఐలుగా పదోన్నతి ఇవ్వడంతో పాటు వారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో పలువురికి డిప్యూటేషన్లు సైతం ఇచ్చింది. వాంకిడి చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న ఏఎంవీఐ సంతోష్‌కుమార్‌ను పదోన్నతిపై ఆసిఫాబాద్‌ చెక్‌పోస్టుకు పంపించింది. వాంకిడి చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న ఏఎంవీఐ సంథాని మహ్మద్‌ పదోన్నతిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. వాంకిడి చెక్‌పోస్ట్‌లో పనిచేస్తున్న ఏఎంవీఐ రాహుల్‌కుమార్‌ను మంచిర్యాలకు బదిలీ చేశారు.

జే. యోగేశ్వర్‌ సింగ్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ భోరజ్‌ ఆదిలాబాద్‌ నుంచి పదోన్నతిపై ఎంవీఐగా మంచిర్యాలకు బదిలీ అయ్యారు. ఎస్‌. శ్రీనివాస్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ భోరజ్‌ ఆదిలాబాద్‌ నుంచి పదోన్నతిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఏ.వరప్రసాద్‌ ఆదిలాబాద్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి పదోన్నతిపై ఖమ్మం జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. ఏ.మహేందర్‌ నిర్మల్‌ జిల్లా భైంసా చెక్‌పోస్టు నుంచి పదోన్నతిపై వరంగల్‌ అర్బన్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి వెళ్లగా, శివస్వప్న ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ భోరజ్‌ ఆదిలాబాద్‌ నుంచి పదోన్నతిపై భైంసా నిర్మల్‌ జిల్లా భైంసా చెక్‌పోస్టుకు బదిలీ చేశారు. టీ. రవికుమార్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ భోరజ్‌ ఆదిలాబాద్‌ నుంచి పదోన్నతిపై ఆదిలాబాద్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి.. అక్కడి నుంచి డిప్యూటేషన్‌పై పెద్దపల్లి జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయానికి బదిలీ చేశారు. నిర్మల్‌ జిల్లా భైంసా చెక్‌పోస్టులో పని చేస్తున్న బీ. శ్రీనివాస్‌ పదోన్నతిపై ములుగు జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయం బదిలీ అయ్యారు.

పలువురు డిప్యూటేషన్లపై...

ఉమ్మడి జిల్లాలో పలువురు డిప్యూటేషన్లపై వెళ్లారు. ఇతర జిల్లాల నుంచి సైతం ఇక్కడకు వచ్చారు. నిర్మల్‌ జిల్లాలో పనిచేస్తున్న డీటీవో కే.హరీంద్రకుమార్‌ డిప్యూటేషన్‌పై ప్రస్తుతం వాంకిడి చెక్‌పోస్టులో పనిచేస్తుండగా, డిప్యూటేషన్‌పై ఆదిలాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ భోరజ్‌కు బదిలీ అయ్యారు. ఏ.చంద్రశేఖర్‌ వాంకిడి చెక్‌పోస్టులో పనిచేస్తుండగా డిప్యూటేషన్‌పై ఆదిలాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ భోరజ్‌కు, ఏ. అభిలాష్‌ జగిత్యాల జిల్లా రవాణా కార్యాలయం నుంచి డిప్యూటేషన్‌పై ఆదిలాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ భోరజ్‌కు, స్రవంతి  వరంగల్‌ అర్బన్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి ఆదిలాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు భోరజ్‌కు, ఎం. సాయిచరణ్‌ జనగామ కార్యాలయం నుంచి ఆదిలాబాద్‌ ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టు భోరజ్‌కు, ఫహిమా సుల్తానా వరంగల్‌ అర్బన్‌ జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి వాంకిడి చెక్‌పోస్టుకు, జీ. మాధవి వరంగల్‌ అర్బన్‌ జిల్లా ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయం నుంచి వాంకిడి చెక్‌పోస్టుకు, కొమ్ము శ్రీనివాస్‌ మంచిర్యాల కార్యాలయం నుంచి వాంకిడి చెక్‌పోస్టుకు, ఎన్‌. ప్రత్యూష మంచిర్యాల జిల్లా ట్రాన్స్‌పోర్టు కార్యాలయం నుంచి వాంకిడి చెక్‌పోస్టుకు, సీహెచ్‌ రాజమల్లు డీటీవో నిర్మల్‌ నుంచి వాంకిడి చెక్‌పోస్టుకు, మహ్మద్‌ ముర్తుజా అలీ వాంకిడి నుంచి భద్రాదికొత్తగూడెం జిల్లా పాల్వంచ చెక్‌పోస్టుకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. 


logo