శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Dec 06, 2020 , 01:50:37

మావోయిస్టుల కదలికలపై నిఘా

మావోయిస్టుల కదలికలపై నిఘా

  •  స్పెషల్‌ పార్టీ పోలీసులకు గ్రేహౌండ్స్‌ తరహా శిక్షణ
  • రామగుండం సీపీ సత్యనారాయణ
  • బెల్లంపల్లిలో ప్రత్యేక శిబిరం ప్రారంభం
  • మొదటి బ్యాచ్‌లో 60 మంది ట్రైనింగ్‌

బెల్లంపల్లి టౌన్‌ : మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు రామగుం డం సీపీ స త్యనారాయణ తెలిపారు. బెల్లంపల్లి పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ల (నాలుగు జిల్లాల) స్పెషల్‌ పార్టీ సిబ్బందికి గ్రేహౌండ్స్‌ తరహా శిక్షణ కోసం ఏర్పాటు చేసిన బీవోఏసీ (బ్యాటిల్‌ అబ్ట్సాకిల్స్‌ అసల్ట్‌ కోర్స్‌)ని శనివారం ప్రారంభించారు. గ్రేహౌండ్స్‌ సిబ్బంది వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇందులో భాగంగా నక్సలైట్ల ఏరివేతకు ఉమ్మడి ఆదిలాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ స్పెషల్‌ పార్టీ మొదటి బ్యాచ్‌ 60 మంది సిబ్బందికి శారీరక దారుఢ్య, ఆయుధ వినియోగం, అనుసంరించాల్సిన వ్యూ హంపై శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అడవుల్లో పోరాటంపై ప్రధాన బలగాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కూంబింగ్‌, ఇంటెలీజె న్స్‌ నెట్‌వర్క్‌ అడవుల్లో సంచరి స్తూ మావోయిస్టుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ ఓఎస్‌డీ ఆపరేషన్‌ శరత్‌ చంద్ర పవార్‌, అడిషనల్‌ డీసీపీ ఏఆర్‌ సంజీవ్‌, ఏసీపీలు రహెమాన్‌, ఏఆర్‌ ఏసీపీ నాగయ్య, ట్రైనీ ఐపీఎస్‌ అశోక్‌ కుమార్‌, ఆర్‌ఐలు అనిల్‌, అంజన్న తదితరులు పాల్గొన్నారు.logo