శనివారం 23 జనవరి 2021
Mancherial - Dec 04, 2020 , 01:41:39

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

మంచిర్యాలటౌన్‌ : పట్టణంలోని మ హంకాళి ఏరియాలోని యువకులు చెడు అలవాట్లను మార్చుకోకపోతే కఠిన చర్య లు తప్పవని పట్టణ సీఐ ముత్తి లింగయ్య హెచ్చరించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గురువారం సీఐ లింగయ్య, ఎస్‌ ఐ మారుతి, బ్లూకోట్స్‌ సిబ్బంది మహంకాళి ఏరియాను సందర్శించారు. ఈ సందర్భంగా వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఐ మాట్లాడుతూ గడిచిన కొన్ని రోజులుగా మహంకాళి ఏరియాకు చెందిన యువకులపై చాలా ఫిర్యాదులు, ఆరోపణలు  వస్తున్నాయని, యువకులు తమ వైఖరిని మార్చుకోవాలని సూ చించారు. అవసరమైతే రౌడీషీట్‌ కూడా ఓపెన్‌ చేస్తామని చెప్పారు. అనంతరం ప్రజలు పలు సమస్యలను సీఐ అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదాల నివారణకు కృషి

కోటపల్లి : జాతీయ రహదారి 63 పై రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్నట్లు చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగరాజు తెలిపారు. మండలంలోని జాతీ య రహదారిపై రోడ్డు ప్రమాదాల నివార ణకు బారీకే డ్లు, రేడియం స్టిక్కర్లు అం టించారు. వాహనాలు అధిక వేగంతో వెళ్లకుం డా ప్రతి రోజూ తనిఖీలు నిర్వహిస్తున్నామని సీఐ వివరించారు. సీసీ కెమెరాలను ఏర్పా టు చేసి వాహనాలను పరిశీలిస్తున్నట్లు వివరించారు.



logo