గురువారం 21 జనవరి 2021
Mancherial - Dec 03, 2020 , 00:43:26

13వ తేదీలోగా అప్‌లోడ్‌ చేయాలి

13వ తేదీలోగా అప్‌లోడ్‌ చేయాలి

  • 14 నుంచి 18 వరకు జిల్లాస్థాయిలో ‘ఇన్‌స్పైర్‌ అవార్డు మనక్‌' పాజెక్టుల పరిశీలన
  • మంచిర్యాల డీఈవో వెంకటేశ్వర్లు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఇన్‌స్పైర్‌ అవార్డు మనక్‌'కు ఎంపికైన విద్యార్థులు తమ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఈ నెల 13వ తేదీలోగా యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు సూచించారు. ఇన్‌స్పైర్‌ అవార్డు మనక్‌పై బుధవారం జూమ్‌ వెబినార్‌ ద్వారా నిర్వహించిన అవగాహన సదస్సులో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ నెల 4వ తేదీ నుంచి యాప్‌లో అప్‌లోడ్‌ చేసుకోవాలని తెలిపారు. జిల్లా నుంచి ‘ఇన్‌స్పైర్‌ అవార్డు మనక్‌' 2019-20కి ఎంపికైన 114 మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌లో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌ విజ్ఞాన మేళ నిర్వహణ-ప్రాజెక్టు తయారీ, పాల్గొనడంపై వెల్లడించారు. ఎంపికైన విద్యార్థులు ప్రదర్శనలో పాల్గొనేందుకు మార్గదర్శకాలను వివరించారు. గైడ్‌ ఉపాధ్యాయుల సహకారంతో ఎంపికైన వి ద్యార్థి, తన ప్రాజెక్టును తయారు చేసుకోవాలన్నా రు.

ఇందుకు సంబంధించి ప్రాజెక్టు వివరణ తెలిపే వీడియో, ఆడియో, ఫొటోలు తీసి ‘మనక్‌ కాంపిటేషన్‌' యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచిం చారు. సందేహాలుంటే హెల్ప్‌డెస్క్‌ 9638 418605నంబర్‌ను సంప్రదించాలని కోరారు. హెచ్‌ఎంలు, గైడ్‌ ఉపాధ్యాయులు గడువులోగా ఆయా పాఠశాలల విద్యార్థుల ప్రాజెక్టులను అప్‌లోడ్‌ చేసేలా చూడాలన్నారు. వాటిని 14 నుంచి 18వ తేదీ వరకు జిల్లాస్థాయిలో న్యాయనిర్ణేతలు పరిశీలించి, రాష్ట్రస్థాయికి ఎంపికచేస్తారని తెలిపా రు. మరిన్ని వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు నంబర్‌ 98495 50200ను సంప్రదించాలని సూచించారు. ఈ జూమ్‌ వెబినార్‌లో జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, 114 పాఠశాలల హెచ్‌ఎంలు, గైడ్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo