గురువారం 28 జనవరి 2021
Mancherial - Dec 01, 2020 , 04:09:08

ఉద్యోగోన్నతుల ఘనత టీబీజీకేఎస్‌దే..

ఉద్యోగోన్నతుల ఘనత టీబీజీకేఎస్‌దే..

  • టీబీజీకేఎస్‌ మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌

బెల్లంపల్లిటౌన్‌: సింగరేణి సీఎం (కంటిన్యూయస్‌ మైనర్‌) సెక్షన్‌లోని కార్మికులకు ఉద్యోగోన్నతి కల్పించిన ఘనత టీబీజీకేఎ స్‌కే దక్కుతుందని ఆ సంఘం మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్‌ అన్నారు. సోమవారం శాంతిఖని షాఫ్ట్‌ బ్లాక్‌ ఆవరణలో సీఎం సెక్షన్‌ రెండో షిఫ్ట్‌ కార్మికులతో సమావేశం నిర్వహించారు. గని పిట్‌ కార్యదర్శి దాసరి శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. 16 మంది కార్మికులకు ఉద్యోగోన్నతులు వచ్చినట్లు పేర్కొన్నారు. సీఎం ఆప రేటర్లు నలుగురు, ఫీడర్‌ ఆపరేట ర్లు నలుగురు, షటిల్‌ కారు ఆపరేటర్లు ఎనిమిది మందికి  వచ్చాయ న్నారు. గత కొన్నేండ్లుగా ఈ సెక్షన్‌ కార్మికులకు ఉద్యోగోన్నతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. కార్మికుల స మస్యలను గుర్తించి, మందమర్రి ఏరియా టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు వెంకట్రావు సహకారం తో డెరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరాం, జీఎం శ్రీనివాస్‌తో కలిసి పలు దఫాలుగా చర్చలు జరపడంతో  స మస్య పరిష్కారమైందని తెలిపారు. ఏడేండ్ల నుంచి నిరీక్షిస్తున్న జీడీకే కార్మికుల కు కూడా తమ ఏరియా సంఘం కృషితోనే ప్ర స్తుతం ఉద్యో గోన్నతులు వచ్చాయని వెల్లడించారు. కార్మికుల సంక్షేమం కోసం టీబీజీకేఎస్‌ అహర్నిశలు కృషి చేస్తోందని పే ర్కొన్నారు. తమ సంఘాన్ని కార్మికులు ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో  నాయకులు బడికెల సంపత్‌, సీవీ రమణ,  వెంకటరమణ, కొట్టె రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  


logo