బుధవారం 27 జనవరి 2021
Mancherial - Nov 30, 2020 , 06:06:16

వైభవంగా కార్తీక పూజలు

వైభవంగా కార్తీక పూజలు

  • భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
  • గూడెంలో సత్యనారాయణ వ్రతాలు 
  • తులసి, ఉసిరి చెట్లకు పూజలు 

దండేపల్లి :  కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఆదివారం జిల్లాలోని అన్ని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి, గంగమ్మ  తల్లికి పూజలు చేశారు. కార్తీక దీపాలను నదిలో వదిలారు. అనంతరం గుట్టపై ఉన్న స్వామివారిని దర్శించుకున్నారు. సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాల్లో దంపతులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో ఉన్న రావిచెట్టు వద్ద, గుట్టపై భాగంలో ఉన్న ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణలు చేసి కార్తీక దీపాలు వెలిగించారు. 

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మంచిర్యాల జిల్లా కేంద్రం సమీపంలో గోదావరి తీరం భక్తులతో సందడిగా మారింది. పుణ్య స్నానాలు చేశారు. గంగమ్మకు,  గౌతమేశ్వర ఆలయంలో పూజలు చేశారు. చెన్నూర్‌ పట్టణంలోని శివాలయం, అగస్త్యేశ్వరాలయం, జగన్నాథ, అయ్య ప్ప పలు ఆలయాల్లో, గోదావరి నది వద్ద పూజలు జరిగాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలంలో పోతెపల్లి, అంబాగట్‌ గ్రామస్తులు ప్రాణహిత నదిలో పూజలు ఉసిరి చెట్టుకు పూజలు చేశారు. దహెగాం మండల కేంద్రంలో పెద్ద వాగు వద్ద సైకత శిల్పాలకు భక్తులు పూజలు చేశారు. రెబ్బెన ఇందిరానగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో ఉసిరి చెట్టు వద్ద పూజలు చేశారు. 


logo