బుధవారం 27 జనవరి 2021
Mancherial - Nov 30, 2020 , 06:01:40

గ్రేటర్‌ ప్రచారంలో మంచిర్యాల ‘కేసీఆర్‌'.. !

గ్రేటర్‌ ప్రచారంలో మంచిర్యాల  ‘కేసీఆర్‌'.. !

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా గద్దరాగడికి చెందిన చెందిన కళాకారుడు మొగిలి రాజా రమేశ్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేషధారణతో  హైదరాబాద్‌ వాసులను ఆకట్టుకుంటున్నాడు.  117వ డివిజన్‌ మూసాపేటలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తూము శ్రావణ్‌కు, 101వ డివిజన్‌ ఎర్రగడ్డలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంజర్ల పల్లవి యాదవ్‌కు మద్దతుగా ఆదివారం ప్రచారం చేశాడు. ఈ సందర్భంగా ప్రచార వాహనంపై అచ్చు కేసీఆర్‌లాగే అభినయిస్తూ ముందుకు సాగాడు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరాడు. సీఎం కేసీఆర్‌ అభిమానులు వచ్చి రాజారమేశ్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ ఉన్నదని రాజారమేశ్‌ తెలిపాడు. logo