ప్రజలతో మమేకం కావాలి

- బాధితులను ఆదరించి, న్యాయం చేయాలి
- మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
- తాండూర్ సర్కిల్ కార్యాలయం తనిఖీ
- పోలీసుల పనితీరుపై ప్రశంస
తాండూర్ : పోలీసులు ప్రజలతో మమేకం కావాలని మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సూచించారు. తాండూర్ సర్కిల్ కార్యాలయాన్ని శనివారం బెల్లంపల్లి ఏసీపీ రెహమాన్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాండూర్ సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్స్టేషన్ల రికార్డులను పరిశీలించారు. ఈ మధ్యకాలంలో నమోదైన కేసులు, వాటి వివరాలు, పెండింగ్ కేసుల వివరాలను సీఐ కోట బాబురావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ..
2020కి సంబంధించిన ఇయర్ ఎండింగ్ తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు. తాండూర్ సర్కిల్ పరిధిలోని నాలుగు పోలీస్స్టేషన్ల పరిధిలో క్రైం రేటు కంట్రోల్లో ఉందన్నారు. రికార్డులన్నీ క్రమబద్ధంగా ఉన్నాయని తెలిపారు. కరోనా కాలంలో సైతం ఎస్ఐలు, పోలీసులు.. పెండింగ్ కేసులు లేకుండా అద్భుతంగా పనిచేశారని ప్రశంసించారు. విజిబుల్ పోలీసింగ్‌తో సంఘటనా స్థలానికి 5 నిమిషాల్లో చేరుకొని, ప్రజలకు సత్వరమే సేవలు అందిస్తున్నారని అభినం దించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరినీ ఆదరించి, తగు న్యాయం చేయాలన్నారు. భూ తగాదాల కేసుల గురించి వచ్చిన ప్రజల అభ్యర్థనలను స్వీకరించి, సమస్యకు మార్గం చూపి మన్ననలు పొందాలని సూచించారు.
అసాంఘిక కార్యక్రమాలపై దృష్టిపెట్టి, నేరాలను కట్టడి చేయాలన్నారు. తాండూర్ సర్కిల్ పరిధిలో ఇప్పటికే పలు గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు, అన్ని గ్రామాల్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా మారుమూల గిరిజన గ్రామాల్లో కమ్యూనిటీ పోలీసింగ్‌తో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్కిల్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. సర్కిల్ కార్యాలయం, మాదారం పోలీస్‌స్టేషన్ ఆవరణలోని పండ్లు, పూల మొక్కలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. మాదారం ఎస్ఐ మానస, భీమిని ఎస్ఐ కొమురయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
తాజావార్తలు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- లాజిస్టిక్ పార్క్ రెడీ..
- తెలుగు భాషకు ప్రాణం పోసిన మహనీయుడు ‘గిడుగు’