శనివారం 23 జనవరి 2021
Mancherial - Nov 27, 2020 , 22:47:30

అడవుల రక్షణకు కృషిచేయాలి

అడవుల రక్షణకు కృషిచేయాలి

  • అటవీశాఖ ప్రిన్సిపల్‌ ఆఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌ జైస్వాల్‌
  • బైసనికుంట అడవుల్లో వాచ్‌టవర్‌,లక్షెట్టిపేటలో అటవీ క్షేత్ర అధికారి క్వార్టర్స్‌ ప్రారంభం

జన్నారం : అడవుల రక్షణకు అందరూ కృషిచేయాలని అటవీశాఖ ప్రిన్సిపల్‌ ఆఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌ జైస్వాల్‌ పిలుపునిచ్చారు. ఇందన్‌పెల్లి రేంజ్‌ బైసనికుంట అడవుల్లో నిర్మించిన వాచ్‌ టవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అడవులు అధికంగా ఉన్న చోట వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తాయన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైనా ఉన్నదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీపీటీ వినోద్‌కుమార్‌, మంచిర్యాల డీఎఫ్‌వో శివాణిడోంగ్రే, ఎఫ్‌డీవో మాధవరావు, చెన్నూర్‌ రాజారావు, లావణ్య, ఎఫ్‌ఆర్వో వెంకటేశ్వర్లుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

అటవీ క్షేత్ర అధికారి క్వార్టర్స్‌ ప్రారంభం..

లక్షెట్టిపేట రూరల్‌ : పట్టణంలోని అటవీ క్షేత్ర అధికారి నూతన క్వార్టర్స్‌ను అటవీశాఖ ప్రిన్సిపల్‌ ఆఫ్‌ కన్జర్వేటర్‌ లోకేశ్‌ జైస్వాల్‌ ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన, మాట్లాడుతూ.. అటవీశాఖ అభివృద్ధికి తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తున్నదన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక టెక్నాలజీ ప్రకారం ప్రభుత్వం అటవీ అధికారులకు అన్ని వసతులను కల్పిస్తున్నదని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.32 లక్షలతో క్వార్టర్స్‌ ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే అటవీ సంపదను పెంపొందించేందుకు శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రతి ఉద్యోగీ పట్టుదలతో పనిచేసి, మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు. అటవీ సంపదను కాపాడే విషయంలో ఎక్కడా రాజీ పడకూడదన్నారు. అనంతరం పురోహితులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ జిల్లా కన్జర్వేటర్‌ వినోద్‌ కుమార్‌, ఎఫ్‌డీవో వినయ్‌ కుమార్‌, ఎఫ్‌ఆర్వో నగావత్‌ స్వామి, డిప్యూటీ ఎఫ్‌ఆర్వో అజార్‌ తదితరులు పాల్గొన్నారు.logo