సోమవారం 25 జనవరి 2021
Mancherial - Nov 27, 2020 , 00:41:39

‘గ్రేటర్‌ ’ ప్రచారంలో మనోళ్లు..

‘గ్రేటర్‌ ’ ప్రచారంలో మనోళ్లు..

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా ఆయా డివిజన్లలో గురువారం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రచారం చేశారు. పార్టీ అధిష్టానం కేటాయించిన వార్డుల్లో ఇంటింటా తిరుగుతూ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. భారీ మెజార్టీతో గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. 95వ డివిజన్‌ అభ్యర్థి కాజ సూర్యనారాయణ తరఫున జూబ్లీహిల్స్‌లో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య.., 147వ డివిజన్‌ అభ్యర్థి కుర్మ హేమలత తరఫున బన్సీలాల్‌పేటలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రచారం చేశారు. అలాగే 143వ డివిజన్‌ అభ్యర్థి మోతె శ్రీలత-శోభన్‌ తరఫున తార్నాకలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని, మంచిర్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, మాజీ విప్‌ నల్లాల ఓదెలు.., 100వ డివిజన్‌ అభ్యర్థి కొలను లక్ష్మీబాల్‌ రెడ్డి తరఫున సనత్‌నగర్‌లో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్‌, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రచారం నిర్వహించారు.

- మంచిర్యాల టౌన్‌/బెల్లంపల్లి టౌన్‌/కోటపల్లి/మందమర్రి


logo