యాసంగికి సిద్ధం

- మంచిర్యాల జిల్లాలో 1,18,380 ఎకరాల్లో సాగు
- 29,066 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం
మంచిర్యాల, నమస్తే తెలంగాణ : మంచిర్యాల జిల్లావ్యాప్తంగా 1,18,380 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో వరి 1,10,216 ఎకరాలు, పెసర్లు 1,330, శనగలు 968, మినుములు 338, కందులు 153, పల్లీలు 393, పొద్దు తిరుగుడు 642, జొన్న 845, గోధుమలు 15, ఆయిల్ పాం 160, మిరప 165, పండ్ల తోటలు 1,040, కూరగాయలు 2, 103 ఎకరాల్లో సాగు కానున్నాయి. ఇంతకముందు రబీ ప్రణాళికను మక్కను కలిపి ప్రతిపాదనలు పంపగా.. మక్క సాగు లేకుండా తిరిగి ప్రతిపాదనలు పంపాలని కోరడంతో వ్యవసాయ శాఖ అధికారులు తిరిగి ప్రణాళిక సిద్ధం చేసి పం పించారు. కాగా.. జిల్లాకు 2020 యాసంగి సీజన్‌కు కావాల్సిన ఎరువులపై కూడా అధికారులు ప్రభుత్వానికి ప్రణాళికలు పంపించారు. ఈ మేరకు అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచారు. జిల్లాకు యూరియా 10,996 మెట్రిక్ టన్నులు, డీఏపీ 7,273, పొటాష్ 5,403, సూపర్ ఫాస్పెట్ 1,044, కాంప్లెక్స్ ఎరువులు 4,350 మెట్రిక్ టన్నులు అవసరమని అంచనా వేశారు.
అధికంగా వరి సాగు
గతేడాది 1,04,200 ఎకరాలు సాగు కాగా.. ఈ యేడాది 1,18,380 ఎకరాలు సాగవుతాయని అధికారులు అం చనా వేశారు. ఇంకా పంటలు పెరుగనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. గతేడాది 95,500 ఎకరాల్లో వరి సాగుకాగా.. ఈ యేడాది 1,10,216 ఎకరాల్లో సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కడెం, గూడెం ఎత్తిపోతలు, గొల్లవాగు, ర్యాలీవాగు ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండడంతో కాల్వల కింద అధికంగా సాగుకానున్నది. భూగర్భ జలాలు పెరగడంతో రైతులు వరి సాగుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ యేడాది కొంచెం ఆలస్యం
వాస్తవానికి యాసంగి సీజన్ ఇప్పటికే ప్రారంభం కావాలి. దీపావళి వరకు కోతలు పూర్తయి ధాన్యం ఇంటికి చేరుకుంటుంది. కానీ, ఈ యే డాది ఖరీఫ్ ఆరంభంలో కురిసిన వర్షాలు జూలైలో నాట్లు వేసుకునే సమయంలో ముఖం చాటేశాయి. ఆగస్టు రెండో వారంలో కురిసిన భారీ వర్షాలతో ఆలస్యంగా నాట్లు వేశారు. దీంతో దిగుబడి 20 నుంచి 25 రోజులు ఆలస్యంగా వస్తున్నది. వాస్తవానికి సకాలంలో వర్షాలు కురిసి నాట్లు వేసుకుంటే అక్టోబర్ మొదటి వారం నుంచి దిగుబడి రావాల్సి ఉంది. కానీ.. ఈ యేడాది నాట్లు ఆలస్యం కావడంతో ఇప్పటికే కొంత మేర కోతలు పూర్తయ్యాయి. అయితే వానకాలంలో కురిసిన వర్షాలతో సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు రైతులకు సూచిస్తున్నారు.
తాజావార్తలు
- వెడ్డింగ్ ఫొటోలు షేర్ చేసిన కాజల్
- సహారా ఎడారిలో ఈ వింత చూశారా?
- బూర్గుల మృతి పట్ల వినోద్ కుమార్ సంతాపం
- గూగుల్ కష్టమర్లకు గుడ్ న్యూస్..!
- బర్డ్ ఫ్లూ నిజంగా ప్రమాదమేనా...?
- ఇక సుంకాల మోతే: స్మార్ట్ఫోన్లు యమ కాస్ట్లీ?!
- లైట్..కెమెరా..యాక్షన్..'ఖిలాడి' సెట్స్ లో రవితేజ
- ఊపిరితిత్తుల ఆరోగ్యానికి 7 చిట్కాలు
- పల్లెల సమగ్రాభివృద్ధి ప్రభుత్వ ఎజెండా
- ముందస్తు బెయిల్ కోసం భార్గవ్‌రామ్ పిటిషన్