ఆదివారం 17 జనవరి 2021
Mancherial - Nov 26, 2020 , 00:56:10

నివర్‌ తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలి

నివర్‌ తుపాన్‌పై అప్రమత్తంగా ఉండాలి

బెల్లంపల్లిరూరల్‌ /కాసిపేట : ఐదు రోజుల్లో రానున్న నివర్‌ తుపాన్‌పై రైతులు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌ నాయక్‌, కాసిపేట మండల వ్యవసాయాధికారిని దేవులపల్లి వందన సూచించారు. వరి కోతలను తాత్కాలికంగా రద్దు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా కోయాల్సి వస్తే కంబైన్డ్‌ హార్వెస్టర్‌ యంత్రాలతో మాత్రమే కోసి, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించి టార్పాలిన్‌ కవర్లను కప్పి ఉంచాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనుషుల చేత వరిని కోయించవద్దని సూచించారు. ఇప్పటికే కోసి ఉన్న వరి మెదలను వెంటనే ఎత్తైన ప్రదేశాలకు తరలించాలన్నారు.  కుప్పలుగా వేయాలన్నారు. ఎకరం కుప్పకు 40 కిలోల కల్లు ఉప్పును మెదల మధ్యలో వేసి టార్పాలిన్‌ కవర్లతో కప్పి ఉంచాలన్నారు. మొలకెత్తకుండా ఉండేందుకు 5 శాతం ఉప్పు ద్రావణాన్ని ధాన్యంపై పిచికారీ చేయాలని సూచించారు.