న్యూ లుక్‌తో జిగేల్ మంటున్న మంచిర్యాల పట్టణం

- పట్టణ ప్రగతి కింద రూ.5 కోట్ల నిధులు
- జాతీయ జెండా రంగులతో సెంట్రల్ లైటింగ్
- ఓవర్ బ్రిడ్జి రెయిలింగ్‌పై అందమైన పెయింటింగ్‌లు
- ఆహ్లాదాన్ని పంచేలా రహదారులకు ఇరువైపులా పూలకుండీలు
- చిన్నారులను కట్టిపడేస్తున్న జంతు, పక్షుల నమూనా బొమ్మలు
జాతీయ జెండా రంగులతో ఆకట్టుకుంటున్న సెంట్రల్ లైటింగ్ .. ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ట్ ఎల్ఈడీ లైట్లు.. రహదారులకు ఇరువైపులా రంగురంగుల పూలకుండీలు.. ఓవర్ బ్రిడ్జి రెయిలింగ్‌కు జంతు, పక్షుల నమూనా చిత్రాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. ఇవన్నీ మంచిర్యాల పట్టణానికి కొత్త శోభను తెస్తున్నాయి. ఈ పనులు పట్టణ ప్రగతి నిధులు రూ.5 కోట్లతో చేపడుతున్నారు. కాగా ఓపెన్ జిమ్‌లు, ట్యాంక్బండ్లు, పార్కుల నిర్మాణాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. - మంచిర్యాల టౌన్
మంచిర్యాలలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్ వరకు జాతీయ జెండా రంగులతో వెలిగే సెంట్రల్ లైటింగ్ చూపరులను ఆకట్టుకుంటున్నది. బెల్లంపల్లి చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు, ఐబీ నుంచి పాత మంచిర్యాల వరకు, ఐబీ నుంచి ఓవర్‌బ్రిడ్జి మీదుగా శ్రీశ్రీనగర్, కాలేజీరోడ్, రైల్వే స్టేషన్‌రోడ్ వరకు ఎల్ఈడీ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో ఉన్న హైమాస్ట్ లైటింగ్ సిస్టంకు కూడా అదనంగా ఎల్ఈడీ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేసి అందంగా కనిపించేలా తయారు చేశారు. ఇక పట్టణం మధ్యలో ఉన్న రైల్వే ఓవర్‌బ్రిడ్జిని అందంగా తీర్చిదిద్దారు. బ్రిడ్జికి ఇరుపక్కలా ఉన్న రెయిలింగ్‌కు రంగులు వేయడంతోపాటు పై భాగంలో ఉన్న గోడలపై అందమైన పెయింటింగ్‌ను వేశారు. ఓవర్‌బ్రిడ్జిపై ఇరువైపులా అందమైన పూలకుండీలను ఏర్పాటు చేశారు. బ్రిడ్జి కింది భాగంలో గ్రీనరీ డెవలప్‌మెంట్‌తోపాటు జంతువులు, పక్షుల నమూనా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇక ఓపెన్‌జిమ్‌లు, చెరువులపై ట్యాంక్ బండ్ నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. పట్టణ సుందరీకరణ పనుల కోసం పట్టణ ప్రగతి కార్యక్రమంలో దాదాపు రూ.5 కోట్ల వరకు వెచ్చించారు.
తాజావార్తలు
- తెలంగాణ సూపర్
- ఈడబ్ల్యూఎస్ కోటాతో సమతూకం
- మేధోకు 2211 కోట్ల కాంట్రాక్టు
- 18 దేశాల్లో టిటా కమిటీలు
- టీజీటీఏ ప్రధాన కార్యదర్శిగా మల్లేశ్
- 25 నుంచి పీజీ ఈసెట్ స్పెషల్ కౌన్సెలింగ్
- ఆయుష్ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
- 24, 25న ఈఎస్సీఐ ఎంబీఏలో స్పాట్ అడ్మిషన్లు
- గిరిజనుల ఆర్థికాభివృద్ధే ఐటీడీఏ లక్ష్యం
- ఓయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు