శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Nov 25, 2020 , 04:26:41

కరోనా నివారణకు సహకరించాలి

కరోనా నివారణకు సహకరించాలి

దహెగాం : కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఇన్‌చార్జి వైద్యాధికారి చంద్రకిరణ్‌ అన్నారు. కొవిడ్‌-19పై అవగాహన, నిర్మూలనపై మండల కేంద్రంలో మంగళవారం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కొన్ని రా ష్ర్టాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయని,  ఇక్కడ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రజలు కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలని సూచించారు. అత్యవసర పను లు ఉంటేనే బయటకు వెళ్లాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలని, గుంపులు గుంపులుగా ఉండవద్దని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. హైల్త్‌ అసిస్టెంట్‌ ఓదెలు, ఏఎన్‌ఎంలు హేమలత, సంతోషమ్మ, బేబి, అనిత, శాంత, లీల, లక్ష్మి, కాంటిజన్‌ వర్కర్‌ బుడిపల్లి మధూకర్‌ పాల్గొన్నారు.  

కొవిడ్‌-19 నిబంధనలు పాటించాలి..

కాగజ్‌ నగర్‌ టౌన్‌ : కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలని మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తా, ఈఎస్‌ఐతో పాటు ఆయా చౌరస్తాల్లో మంగళవారం ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించారు. 


logo