రైతులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి

- మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
సీసీసీ నస్పూర్ : ధాన్యం కొనుగోలులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై సీసీసీ సింగరేణి అతిథి గృహంలో జిల్లా అధికారులు, రైస్ మిల్లరు, పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, సివిల్ సైప్లె అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆమె పలు సలహాలు, సూచనలు చేశారు. కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే గోదాములకు తరలించాలని సూచించారు. రైతులు రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లకుండా చూడాలని, వారి నుంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ ఏడాది దిగుబడి ఎక్కువగా ఉందని, ఒక్క రైతుకూ నష్టం లేకుండా చూడాలని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వాలిటీ ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి కేంద్రం వద్ద తప్పని సరిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో జిల్లా సివిల్ సైప్లె అధికారి వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు శ్రీనివాస్, శ్యామలాదేవి, డీఎం గోపాల్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జైపూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. మండలకేంద్రంతో పాటుగా కిష్టాపూర్‌లో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతుల నుంచి నాణ్యమైన ధాన్యం సేకరించాలని సూచించారు. రైస్ మిల్లుల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం వేలాలలో రైతువేదిక నిర్మాణాన్ని పరిశీలించారు. శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్ నిర్మాణాల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట డీసీఎస్వో వెంకటేశ్వర్లు, అధికారులు పాల్గొన్నారు.
రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని మూడు గంటల్లోపే దింపాలి
ఆసిఫాబాద్ టౌన్: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని మూడు గంటల్లోపే దించుకోవాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్‌రాజ్ మిల్లర్లను ఆదేశించారు. ధాన్యం కొనుగోలుపై కలెక్టరేట్లో రైస్ మిల్లర్లతో సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 41 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 10 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, 236 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని చెప్పారు. మిగతా 18 కేంద్రాలను మంగళవారం మధ్యాహ్నం లోగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల్లో గోనె సంచుల లోటు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గోనె సంచులపై రైతుల వారీగా నంబర్లు వేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు, పౌర సరఫరాల శాఖ అధికారి స్వామి, డీఎం హరికృష్ణ, రైస్ మిల్లర్లు ఉన్నారు.
తాజావార్తలు
- దేశీ ఐటీ దిగ్గజం అరుదైన ఘనత
- రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే రాజీనామా
- త్రిపుర సీఎం నివాసం వద్ద ఉపాధ్యాయుల నిరసన
- అత్యాధునిక ఫీచర్లతో న్యూ జీప్ కంపాస్
- తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
- యాప్‌లపై నిషేధం డబ్ల్యూటీవో నియమాల ఉల్లంఘనే..
- ట్రక్కును ఢీకొట్టిన అంబులెన్స్.. ఐదుగురు దుర్మరణం
- అమిత్ షా నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష
- పోకో నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్...!
- అరెస్ట్ చేయకుండా ఆపలేం.. తాండవ్ మేకర్స్‌కు సుప్రీం షాక్