సోమవారం 25 జనవరి 2021
Mancherial - Nov 22, 2020 , 00:13:42

మియావాకి పద్ధతిలో మొక్కల పెంపకం

మియావాకి పద్ధతిలో  మొక్కల పెంపకం

  • రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌,  ఎండీ పీ రఘువీర్‌

మంచిర్యాల కల్చరల్‌ : జిల్లాలో మియావాకి పద్ధతిలో మొక్కలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ వైస్‌ చైర్మన్‌, ఎండీ పీ రఘువీర్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లా అటవీ శాఖ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మియావాకి పద్ధతిలో మొక్కకు, మొక్కకు మధ్యలో 75 సెంటీమీటర్ల దూరం పాటిస్తూ తక్కువ హెక్టార్ల విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచాలని అధికారులకు సూచించారు. రాజీవ్‌ రహదారికీ ఇరువైపుల ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేప ట్టాలని పేర్కొన్నారు.  రైతులకు నీలగిరి మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని సూచించా రు. ఇది వరకే మంచిర్యాల జిల్లాలో మియావాకి పద్ధతిలో ఇందారం, కిష్టంపేటల్లో మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. ఈ పద్ధతిన పక్క రాష్ట్రంలో కూడా పెంచేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్లాంటేషన్‌ జీఎం రవీందర్‌ రెడ్డి, డివిజనల్‌ మేనేజర్‌ కవిత, సురేశ్‌, నాగరాజు, సైదానాయక్‌ పాల్గొన్నారు.logo