గురువారం 21 జనవరి 2021
Mancherial - Nov 22, 2020 , 00:05:08

కార్తీక సందడి

కార్తీక సందడి

  • గూడెంలో కొనసాగుతున్న పూజలు
  • సామూహిక వ్రతాలు, అభిషేకాలు
  • గోదావరిలో పుణ్యస్నానాలు..
  • గంగమ్మ తల్లికి మొక్కులు

లక్షెట్టిపేట :  మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పూజలు కొనసాగుతున్నాయి. శనివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడంతో పాటు దర్శించుకున్నారు. అనంతరం అభిషేకాలు, అర్చనలు చేశారు. అంతకుముందు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్టకింద రావి చెట్టు దగ్గర కార్తీక దీపాలు వెలిగించారు.


logo