శనివారం 23 జనవరి 2021
Mancherial - Nov 21, 2020 , 02:39:06

బాలల సంరక్షణ అందరి బాధ్యత

బాలల సంరక్షణ అందరి బాధ్యత

  •  డీపీవో నారాయణ 

మంచిర్యాల అగ్రికల్చర్‌ : నేటి బాలలే దేశానికి దశ, దిశ నిర్ణయించే భావి భారత పౌరులని, వారి సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని డీపీవో నారాయణ పేర్కొన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయ ఆవరణలో జిల్లా బాలల పరిరక్షణ సమితి, చైల్డ్‌లైన్‌ ‘1098’ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలురు, బాలికలు అనే తేడా లేకుండా చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అంగన్‌ వాడీ, సఖీ కేంద్రాలను మహిళలు, చిన్నారులు వినియోగించుకోవాలన్నారు. ఆపదలో ఉన్నప్పుడు 1098కి సమాచారం అందించి రక్షణ పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీడబ్ల్యూవో రౌఫ్‌ఖాన్‌, బాలల సంరక్షణ అధికారి ఆనంద్‌, విద్యాశాఖ సెక్టోరల్‌ అధికారి పద్మజ, చైల్డ్‌ లైన్‌ డైరెక్టర్‌ ఫాదర్‌ బిజో, కో ఆర్డినేటర్‌ సత్యనారాయణ,  తదితరులు పాల్గొన్నారు.


logo