శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Nov 20, 2020 , 01:13:07

భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు

భార్యను హత్య చేసిన  భర్తకు జీవిత ఖైదు

శ్రీరాంపూర్‌/గర్మిళ్ల : భార్యను హత్య చేసిన కేసులో భర్తకు జీవిత ఖైదు, రూ.3 వేల జరిమానా విధిస్తూ గురువారం మంచిర్యాల జిల్లా అదనపు న్యాయమూర్తి కే సత్యనారాయణబాబు తీర్పునిచ్చారు. నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లి గ్రామానికి చెందిన జాడి బాపునకు జైపూర్‌ మండలం నర్వ గ్రామానికి చెందిన బండారి అంజలితో 16 ఏళ్ల కిత్రం వివాహం జరిగింది.  వీరికి ఇద్దరు పిల్లలున్నారు. భూమి, డబ్బులకు సంబంధించి భార్య, భర్తలకు తరచూ గొడవలు జరిగేవి.

ఈ క్రమంలో 31 ఆగస్టు 2016 సంవత్సరంలో అంజలిని బాపు గొడ్డలితో నరికి చంపాడు. మృతురాలి తండ్రి బండారి భూమయ్య ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్‌ఐ పీ దత్తాత్రి, సీఐ ప్రవీణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నిందితుడు జాడి బాపు ను కోర్డులో హాజరు పర్చారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూట ర్‌ నోముల రాజ్‌కుమార్‌, హెడ్‌ కాస్టేబుల్‌ ఆకుదారి కిష్టయ్య, కే రమణ 16 మంది సాక్షులను ప్రవేశ పెట్టారు.హత్యా నేరం రుజువు కావడంతో జాడి బాపుకు జీవిత ఖైదుతో పాటు రూ.3,000  జరిమానా విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. 


logo