మంగళవారం 26 జనవరి 2021
Mancherial - Nov 19, 2020 , 01:59:44

మహారాష్ట్ర వాసిపై పీడీ యాక్టు

మహారాష్ట్ర వాసిపై పీడీ యాక్టు

కోటపల్లి : మహారాష్ట్ర నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చి మంచిర్యాల జిల్లాలలోని కోటపల్లి, తాళ్ల గురిజాల, భీమిని మండలాల రైతులకు విక్రయిస్తున్న మార్కవార్‌ రమేశ్‌ భాస్కర్‌ పై పీడీ యాక్టు అమలు చేసినట్లు చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్‌ఐ రవి కుమార్‌ తెలిపారు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా గోండ్‌ పిపారి తాలుకా విఠల్‌ వాడకు చెందిన రమేశ్‌ భాస్కర్‌ తక్కువ ధరలకు పత్తి విత్తనాలను తీసుకువచ్చి రైతులకు అంటగట్టి మోసం చేస్తున్నాడని సీఐ వివరించారు. నకిలీ విత్తనాలను విక్రయించడం ద్వారా పత్తి మొక్కలు ఎదగక,

దిగుబడి రాక రైతులు నష్ట పోతున్నారని వివరించారు. ఇలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. నిందితుడిపై ఇప్పటికే కోటపల్లితో పాటు తాళ్ల గురిజాల, భీమిని మండలాల్లో కేసులున్నాయని వివరించారు. నిందితుడిపై పీడీ యాక్టు అమలుకు కృషి చేసిన జైపూర్‌ ఏసీపీ నరేందర్‌, చెన్నూర్‌ రూరల్‌ సీఐ నాగరాజు, ఎస్‌ఐ రవి కుమార్‌ను రామగుండం సీపీ సత్యనారాయణ అభినందించారు. నిందితుడికి పీడీ యా క్టు నిర్బంధ ఉత్తర్వులు అందించిన అనంతరం వరంగల్‌ కేంద్ర కారాగారానికి తరలించారు.logo