ఆదివారం 24 జనవరి 2021
Mancherial - Nov 19, 2020 , 01:59:44

ఉత్తమ సేవలకు పురస్కారాలు

ఉత్తమ సేవలకు పురస్కారాలు

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జీవీకే ఈఎంఆర్‌ఐ సంస్థ 108 అంబులెన్స్‌ ద్వారా ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి తెలంగాణ రీజినల్‌ మేనేజర్‌ ఖలీద్‌ ప్రతిభా పురస్కారాలు అందించారు. హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి వైద్యశాలలోని జీవీకే ఈఎంఆర్‌ఐ రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో 108 సిబ్బందిని అభినందించారు. 108 సంస్థలో 15 ఏళ్లు పూర్తి చేసుకొని ఉత్తమ సేవలందించిన జిల్లా ఈఎంటీ వేణుకు పురస్కారం అందజేసి అభినందించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ నరేందర్‌, అధికారులు శ్రీకాంత్‌, రాము, దయాకర్‌, హమీద్‌ పాల్గొన్నారు.logo