బుధవారం 20 జనవరి 2021
Mancherial - Nov 17, 2020 , 05:09:41

అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ధ్యేయం

  • తెలంగాణ పాలన  దేశానికే  ఆదర్శం
  •  ఎంపీ వెంకటేశ్‌ నేతకాని
  •  ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసిపలు అభివృద్ధి పనులకుశంకుస్థాపన

మంచిర్యాలటౌన్‌ : అభివృద్ధి, సంక్షేమమే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌ నేతకాని  అన్నారు. మంచిర్యాలలోని శ్రీశ్రీనగర్‌లో మిషన్‌ భగీరథ పథకం కింద నిర్మిస్తున్న 800 కేఎల్‌ ఓవర్‌హెడ్‌ ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి సోమవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీది అబద్దాల ప్రభుత్వమని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ది అభివృద్ధి ప్రభుత్వమని అన్నారు. తెలంగాణ పాలన దేశానికే ఆదర్శనమని చెప్పారు. బీజేపీ రాష్ట్రంపై వివక్ష చూపుతున్నదని విమర్శించారు. బీజేపీ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు బీజేపీ తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టి గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంటింటికీ తాగునీరందించేందుకు రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం మిషన్‌ భగీరథ పథకాన్ని ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు.

మంచిర్యాలలో రూ. 58 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు సాగుతున్నాయని చెప్పారు. నూతనంగా మూడు రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. 260 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే రైల్వే  అండర్‌ బ్రిడ్జి నిర్మించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముఖేశ్‌ గౌడ్‌, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ విజిత్‌రావు, కౌన్సిలర్లు మోతె సుజాత, హరికృష్ణ, బోరిగం శ్రీనివాస్‌, గాదె సత్యం, పోరెడ్డి రాజు, అనిత, హఫీజా బేగం, టీఆర్‌ఎస్‌ నాయకులు గొంగళ్ల శంకర్‌, పడాల రామన్న, బుద్దార్థి రాంచందర్‌ పాల్గొన్నారు. సర్వేనంబర్‌ 356లో 12 గుం టల స్థలంలో  తాము కాస్తులో ఉన్నామని,  గాదా సు శంకరమ్మ, శ్రీధర్‌, పోశం ఆందోళనకు దిగారు. తమ స్థలంలో ట్యాంకు నిర్మాణాన్ని చేపడుతున్నా రని, ప్రత్యా మ్నాయంగా స్థలం ఇచ్చాకే ట్యాంకు నిర్మించాలని వారు కోరారు. 

సేవకుల్లా పని చేస్తున్నాం

లక్షెట్టిపేట : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,  ప్రజా ప్రతినిధులు  ప్రజలకు సేవకుల్లా నిరంతరం పని చేస్తున్నామని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్‌ నేతకాని అన్నారు. మండలంలోని కొత్తూరులో సీసీ రోడ్డు, కొనుగోలు కేంద్రాలను, లక్ష్మీపూర్‌లో బీటీ రోడ్డు నిర్మాణ పనులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను  ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్‌ రావు ప్రారంభించారు. ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో  ఎంపీపీ అన్నం మంగ, చిన్నయ్య, ఎంపీడీవో సత్యనారాయణ మున్సిపల్‌ చైర్మన్‌ నలుమాసు కాంతయ్య, వైస్‌ చైర్మన్‌ పొడేటి శ్రీనివాస్‌ గౌడ్‌, పీఆర్‌ ఏఈ శృతి, సర్పంచ్‌లు సొల్లు సురేశ్‌, శిరీష, ఆసాది పురుషోత్తం, రవి, ఎంపీటీసీ కల్లు దావీదు, కౌన్సిలర్‌ చాతరాజు రాజన్న, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి శ్రీనివాస రెడ్డి, పాదం శ్రీనివాస్‌, కిషన్‌, షారుఖ్‌, పురుషోత్తం, వేణు, ఎంబడి రమేశ్‌, కటకం రమేశ్‌, తిరుపతి, రామ్మూర్తి, శంకరయ్య, ప్రశాంత్‌, లచ్చన్న, శంకరయ్య, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo