నాణ్యమైన బొగ్గుతోనే లాభాలు

- జీఎం లక్ష్మీనారాయణ
- నాణ్యతా వారోత్సవాలు ప్రారంభం
సీసీసీ నస్పూర్ : నాణ్యమైన బొగ్గుతోనే సంస్థ లాభాల బాటలో పయనిస్తుందని శ్రీరాంపూర్ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు సింగరేణిలో బొగ్గు నాణ్యతా వారోత్సవాలు జరుగనున్నాయి. బుధవారం వారోత్సవాల సందర్భంగా ఆర్కే-5గని, ఆర్కే-6, ఆర్కే న్యూటెక్, ఎస్పార్పీ-3, ఓపెన్ కాస్ట్ గనుల్లో అధికారులు జెండా ఆవిష్కరించారు. బొగ్గు నాణ్యతపై ఉద్యోగులందరితో ప్రతిజ్ఞ చేయించారు. జీఎం కార్యాలయంలో జెం డా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జీఎం లక్ష్మీనారాయణ మాట్లాడారు. ఆయా చోట్ల టీబీజీకేఎస్ ఏరి యా ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, క్వాలిటీ డీజీఎం రమేశ్, ఎస్వోటూ జీఎం కుమారస్వామి, ఏరియా ఇంజినీర్ కుమార్, డీజీ ఎం పర్సనల్ గోవిందరాజు, ఐఈడీ డీజీఎం చిరంజీవులు, పర్సనల్ మేనేజర్ అజ్మీరా తుకారాం, పిట్ కార్యదర్శి పీవీ రావు, రాళ్లబండి రాజన్న, ఆర్కే-5గని మేనేజర్ అబ్దుల్ ఖాదీర్, రక్షణాధికారి శివ య్య, డిప్యూటీ మేనేజర్ రాందాస్, పిట్ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, ఆర్కే-6గని మేనేజర్ సంతోష్‌కుమార్, పిట్ కార్యదర్శి చిలుముల రాయమల్లు, ఆర్కే-న్యూటెక్ గనిలో మేనేజర్ స్వామిరాజు, పిట్ కార్యదర్శి పొట్లచర్ల శ్రీరాములు, ఎస్సార్పీ -3గని మేనేజర్ రవికుమార్, పిట్ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, మేనేజర్ జనార్దన్, టీబీజీకేఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య పాల్గొన్నారు.
నాణ్యత పెంచేందుకు కృషి చేయాలి
రెబ్బెన : ప్రతి ఒక్క ఉద్యోగి బొగ్గు నాణ్యత పెంచేందుకు కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జీఎం కొండయ్య పేర్కొన్నారు. గోలేటి జీఎం కార్యాలయంలో బొగ్గు నాణ్యతా వారోత్సవాలు ప్రారంభం సందర్భంగా జీఎం కొండయ్య జెండా ఆవిష్కరించారు. ప్రతిజ్ఞ చేసిన అనంతరం ఆయ న మాట్లాడారు. డీఎంఎస్ మెకానికల్ రత్నాకర్, ఏజీఎం (ఈఅండ్ఎం), కమలాకర్భూషణ్, కైర్‌గూడ ఓసీపీ పీవో శ్రీరమేశ్, డీజీఎం(ఐఈడీ) యోహన, పీఎం రామాశాస్త్రి, డీజీఎం(సివిల్) శివరామిరెడ్డి, క్వాలిటీ ఇన్చార్జి గోమాస రవి, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి రవీందర్ పాల్గొన్నారు.
మందమర్రి రూరల్ : బొగ్గు నాణ్యతపైనే సింగరేణి సంస్థ మనుగడ ఆధారపడి ఉంటుందని ఇన్ చార్జి జీఎం కే వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో నిర్వహించిన నాణ్యతా వారోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. ఈ సందర్భంగా అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఎస్వోటూ జీఎం రామ్మోహన్రా వు, ఏజీఎం పర్సనల్ చక్రవర్తి, పీఎం వర ప్రసాద్, సేఫ్టీ అధికారి ఓదెలు, డీజీఎం పర్చేస్ సురేశ్, డీజీఎం ఐఈడీ రాజన్న పాల్గొన్నారు.