‘ధరణి’తో సులువుగా రిజిస్ట్రేషన్

- సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోపన్ప
పెంచికల్పేట్ : రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకు వచ్చారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోపన్ప అన్నారు. మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. అధికారులు అందిస్తున్న సేవలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. లోడ్పెల్లి గ్రామానికి చెందిన మీస లక్ష్మి తన కొడుకు సురేశ్‌కు గిఫ్ట్ డీడ్‌గా అందించిన 1. 03 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయగా, పాసుబుక్‌ను ఎమ్మెల్యే వారికి అందించారు. ధరణి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ అరగంట వ్యవధిలోనే పూర్తిచేసి పట్టా కాగితాలను చేతికందించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తన్నారని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్త చంద్రాగౌడ్ ఇటీవల గుండెపోటుతో మరణించగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట తహసీల్దార్ రఘునాథ్‌రావు, లోడ్పెల్లి సర్పంచ్ జాజిమొగ్గ శ్రీనివాస్, ఎంపీటీసీ రాజన్న, మండల కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ సాజీద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌదరి తిరుపతి, నాయకులు సముద్రాల రాజన్న, ఖలీల్ బేగ్, ఖైరత్, పుల్లూరి రామన్న, రాజేశ్వర్ ఉన్నారు.
తాజావార్తలు
- ధోనీని మించిన రిషబ్ పంత్.. కొత్త రికార్డు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
- కాళేశ్వరం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్
- కావాల్సినవి 145 పరుగులు.. చేతిలో 7 వికెట్లు
- కరోనాతో సీపీఎం ఎమ్మెల్యే మృతి
- వ్యాక్సిన్ పంపిణీపై డబ్ల్యూహెచ్‌వో అసంతృప్తి
- వీడియో : అదిరింది..మోగింది