మంగళవారం 26 జనవరి 2021
Mancherial - Nov 11, 2020 , 02:30:26

కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలి

కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలి

  • కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాంబాబు

దహెగాం : ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకొని, మద్దతు ధర పొందాలని రైతులకు కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాంబాబు సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మం గళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడు తూ.. గతంతో పోలిస్తే వ్యవసాయం పరంగా రైతులు ఎంతో అభివృద్ధి చెందారన్నారు. ముఖ్యంగా వరి సాగు గణనీ యంగా పెరిగిందన్నారు. ఈ ఏడాది జిల్లాలో 28 కొనుగోలు కేంద్రాల ద్వారా 41 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు. ఈ మేరకు 17 రైస్‌ మిల్లులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ధాన్యం అమ్మిన 3 నుంచి 4 రోజుల్లోనే డబ్బులు రైతు ఖా తాలో జమచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ధాన్యం పూర్తిగా ఎం డిన తరువాతనే కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా కొనుగోలు సమయంలో ఏర్పడుతున్న పలు సమస్యలను రైతులు అదనపు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్లపల్లి శ్రీరామరావు, సింగిల్‌ విండో చైర్మన్‌ కొండ్ర తిరుపతిగౌడ్‌, రైతు బంధు సమితి మండల కన్వీనర్‌ కంబగౌని సంతోష్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ చౌదరి సురేశ్‌, సర్పంచ్‌ పుప్పాల లక్ష్మి, ఎంపీటీసీ రాపర్తి జయలక్ష్మి, పౌరసరఫరాల శాఖ డీఎం డీఎం హరికృష్ణ, డీసీవో కృష్ణ, డీఎస్‌వో స్వామికుమార్‌, డీసీఏవో రబ్బాని, కార్యదర్శి చప్పిడ బక్కయ్య, సింగిల్‌ విండో డైరెక్టర్లు అల్గం మల్లేశ్‌, దుండ్ర శ్రీనివాస్‌, షాఖీర్‌, రైతులు పాల్గొన్నారు.

ధరణి పోర్టల్‌తో  రిజిస్ట్రేషన్లు సులభతరం..

ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులభతరమయ్యాయని కుమ్రం భీం ఆసిఫాబాద్‌ అదనపు కలెక్టర్‌ రాంబాబు అన్నారు. తహసీల్‌ కార్యాలయంలోని ధరణి పోర్టల్‌, రిజిస్ట్రేషన్ల విధానాన్ని పరిశీలించి, రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని తహసీల్దార్‌ రామ్మోహన్‌ను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టి, రిజిస్ట్రేషన్‌ ప్రకియ పూర్తిచేయాలని సూచించారు. అనంతరం తహసీల్‌ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీటీ బక్కయ్య, ఆర్‌ఐ మోహన్‌ రాథోడ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


logo