శనివారం 23 జనవరి 2021
Mancherial - Nov 11, 2020 , 02:30:26

యువతకు అండగా ఉంటా..

యువతకు అండగా ఉంటా..

  • మినీ స్టేడియంను ఉపయోగకరంగా తీర్చిదిద్దుతా
  •  క్రీడా సామగ్రి, జిమ్‌ ఏర్పాటు చేస్తా 
  • సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కౌటాల : యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో మంగళవారం ఉదయం వాకర్స్‌, యువకులతో కలిసి వాకింగ్‌ చేశారు. స్టేడియాన్ని పరిశీలించి, అందరితో కలిసి పశువుల పేడ, చెత్త, పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం యువత, వాకర్స్‌తో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. పోలీస్‌ ఉద్యోగాల కోసం గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేసేందుకు కాస్త ఇబ్బందులు పడుతున్నట్లు వారు తెలిపారు. అలాగే పశువులను మేతకు పంపడం వల్ల పేడ, కొంతమంది మద్యం తాగి అక్కడే సీసాలను పగులగొడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. హైజంప్‌, ఫుట్‌బాల్‌, వాలీబాల్‌, షాట్‌పుట్‌ తదితర ఆటలకు సంబంధించిన సామగ్రి లేదని వివరించారు. అలాగే వాకింగ్‌ ట్రాక్‌ పూర్తిగా చెత్తతో నిండిపోవడంతో నడిచేందుకు కూడా వీలులేకుండా ఉందని ఆయనకు తెలిపారు. దహెగాం మండలానికి చెందిన కొందరు యువకులు పోలీస్‌ ఉద్యోగం కోసం కౌటాలకు వచ్చి, అద్దె గదుల్లో ఉంటూ స్టేడియంలో ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు ఎమ్మెల్యేకు చెప్పారు. ఇందుకు ఎమ్మెల్యే స్పందించి మాట్లాడారు. మినీ స్టేడియం కౌటాల ప్రజలకు ఒక వరమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునేలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. క్రీడా సామగ్రి, వాకింగ్‌ ట్రాక్‌, పిచ్చి మొక్కల తొలగింపు, యువకులకు కావాల్సిన క్రీడా సామగ్రి, ఓపెన్‌ జిమ్‌ అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్‌ వొజ్జాల మౌనీష్‌, కో ఆప్షన్‌ సభ్యుడు అజ్మత్‌ అలీ, ఉప సర్పంచ్‌ పసునూరి తిరుపతి, మొగడ్‌ధగడ్‌ ఎంపీటీసీ బొమ్మకంటి మనీష్‌, సీఐ శ్రీనివాస్‌, మండలంలోని వాకర్స్‌, యువకులు తదితరులు ఉన్నారు.logo