బుధవారం 27 జనవరి 2021
Mancherial - Nov 10, 2020 , 02:31:24

రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టాలి

రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టాలి

  • మంత్రి తలసానికి విన్నవించిన యాదవ మహాసభ  నాయకులు

 మందమర్రి : రెండో విడుత గొర్రెల పంపిణీ చేపట్టాలని అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు బండి సదానందం యాదవ్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కోరారు. హైదరాబాద్‌లో సోమవారం మంత్రిని కలిసిన నాయకులు వినతి పత్రం ఇచ్చారు. జిల్లాలో యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. యాదవ సంఘాల భవన నిర్మాణాలను, గొర్రెలు, మేకల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని సదానందం తెలిపారు. మంత్రికి నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం సతీశ్‌ యాదవ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లంల నాగన్న యాదవ్‌, నాయకులు మాచర్ల గట్టయ్య, పలుమారు అంజయ్య యాదవ్‌, బండి శివకుమార్‌ పాల్గొన్నారు. 


logo