మంగళవారం 19 జనవరి 2021
Mancherial - Nov 10, 2020 , 02:32:04

యువత రక్తదానం చేయాలి

యువత రక్తదానం చేయాలి

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌): యువత రక్తదానం చేయాలని శ్రీరాంపూర్‌ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ కోరారు. ఎంవీటీసీలో రక్తదాన శిబిరాన్ని జీఎం ప్రారంభించా రు. రక్తదానం చేసిన కారుణ్య ఉద్యోగులకు జీఎం, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి గుర్తింపు పత్రాలను అందించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్‌ ఏరియాలో ఇప్పటి వరకు 14 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి 1200ల యూనిట్ల రక్తం సేకరించామని తెలి పారు. ఎంవీటీసీ మేనేజర్‌ కే వెంకటరామారావు, పీఎం తుకారాం, రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ చందూరి మహేందర్‌, చుం చు శంకర్‌ వర్మ, డాక్టర్‌ శరత్‌బాబు, రంజిత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.