శుక్రవారం 15 జనవరి 2021
Mancherial - Nov 07, 2020 , 03:34:51

పంట మార్పిడి పద్ధతి పాటించాలి

పంట మార్పిడి పద్ధతి పాటించాలి

బెల్లంపల్లి రూరల్‌ : రైతులు పంట మార్పిడి పద్ధతులు అవలంబిస్తేనే ఫలితాలు సాధించవచ్చని బెల్లంపల్లి కేవీకే సీనియర్‌ శాస్త్రవేత్త, ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌ అన్నారు. బెల్లంపల్లి కేవీకే ఆధ్వర్యంలో గోండుగూడెంకు చెందిన రైతులకు గిరిజన ఉప ప్రణాళిక కింద కిన్నెరజొన్న విత్తనాలతో పాటు పీఎస్‌బీ, అజోైస్టెరిల్లమ్‌ అనే జీవన ఎరువులను శుక్రవారం అందించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన వంగడాలను సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలన్నారు.  రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల సేవలను వినియోగించుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ సూచించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా కూరగాయల సాగు, తేనెటీగల పెంపకంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. సమావేశం లో ఎంపీపీ గోమాస శ్రీనివాస్‌, బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్‌ నాగరాజు, డాక్టర్‌ తిరుపతి, డాక్టర్‌ స్రవంతి,డాక్టర్‌ సతీశ్‌, డాక్టర్‌ మహేశ్‌, రైతులు పాల్గొన్నారు.