శుక్రవారం 22 జనవరి 2021
Mancherial - Nov 06, 2020 , 01:54:05

తగ్గుముఖం పట్టినా..తస్మాత్‌ జాగ్రత్త

తగ్గుముఖం పట్టినా..తస్మాత్‌ జాగ్రత్త

మంచిర్యాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో కరోనా మహమ్మారి తగ్గుము ఖం పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు న్న ముందస్తు చర్యలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ సూచించిన నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించడం తో కేసులు తగ్గాయి. దీంతో పాటు మొదటి నుంచి లాక్‌డౌన్‌తో పాటు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పౌష్టికాహారం తీసుకోవడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. రోజుకు జిల్లావ్యాప్తంగా 3 -4 వేల వరకు నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా, కేవలం 40 నుంచి 50 వరకు మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. పాజిటివ్‌ కేసుల శాతం 9 శాతం కాగా, రికవరీ రేటు 94 శాతానికి పెరిగింది.  

మూడు నెలల్లో ఎక్కువ కేసులు..

జిల్లాలో జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో కరోనా తీవ్ర రూపం దాల్చింది. రోజుకు 100 నుంచి 200 వరకు కూడా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభు త్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  ర్యాపిడ్‌ యాంటిజెన్‌ కిట్లతో పరీక్షలు చేయించింది. జిల్లాలోని దవాఖానల్లో నూ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. పాజిటివ్‌ వచ్చిన వారు జిల్లాలోని బెల్లంపల్లి ఐసొలేషన్‌ కేంద్రంతో పాటు హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో చికిత్స తీసుకున్నారు. ఇంకొందరు ప్రైవేట్‌ దవాఖానలను ఆశ్రయించారు. 

కరోనాను పట్టించుకోని ప్రజలు.. 

ఏడు నెలలుగా కచ్చితంగా నిబంధనలు పాటించడంతో కరో నా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. అయితే తీవ్రత తగ్గిన నేపథ్యం లో ప్రజలు నెల రోజులుగా కొవిడ్‌ -19 నిబంధనలు తుం గలో తొక్కుతున్నారు. కనీసం మాస్కులు ధరించకుండా తిరుగుతున్నారు. భౌతికదూరం పాటించకపోవడంతో పాటు శానిటైజర్లు వాడడం లేదు. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ  మూడు నెలలు జాగ్రత్త..

కరోనా ప్రస్తుతం కొంతమేర కట్టడిలో ఉన్నా.. రానున్న మూడు నెలల పాటు రెండో దశ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు నిబంధనలు పాటించకపోవడంతో పాటు ఇప్పుడు చలికాలం కావడంతో వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రజలు దసరా పండుగకు ఊళ్లకు వెళ్లిరావడం, శుభకార్యాలు, వివాహాలు, దీపావళి ఉండడంతో కరోనా రెండో దశ వ్యాప్తికి అ వకాశం ఉందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉం టే రెండో దశ కూడా విజయవంతంగా అరికట్టవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. 

మొత్తం పరీక్షలు - 69,901

 పాజిటివ్‌ కేసులు (శాతం) - 9 

 డిశ్చార్జి (శాతం) - 93.82 

 మరణాలు - 37 

 రికవరీ శాతం - 94 

 మరణాల శాతం - 0.32 

ప్రజలు జాగ్రత్తలు పాటించాలి..

ప్రస్తుతం వ్యాధి తీవ్రత లేకున్నా, మళ్లీ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక దూరం పా టించాలి. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతి రుమాలు అ డ్డం పెట్టుకోవాలి. మాస్కు ధరించాలి. చేతులను సబ్బు తో లేదా శానిటైజర్‌తో కడుక్కోవాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సంచరించవద్దు. 

 నీరజ, డీఎంహెచ్‌వో 


logo