శుక్రవారం 15 జనవరి 2021
Mancherial - Nov 06, 2020 , 03:45:40

ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

బెల్లంపల్లిటౌన్‌ : బెల్లంపల్లి లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో 20 మంది నిరుపేద విద్యార్థులకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ ఇస్తున్నట్లు లయన్స్‌క్లబ్‌ అధ్యక్షుడు చెవిటి సుదర్శన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పేస్‌ కంప్యూటర్‌ శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న విద్యార్ధులకు ఒక నెల కాల పరిమితితో ఉచితంగా ఎంఎస్‌ ఆఫీస్‌ కోర్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు బయోడేటాతో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి ఈ నెల 11వ తేదీలోగా పేస్‌ కంప్యూటర్‌ శిక్షణ కేం ద్రంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9866699687, 9440535319ను సంప్రదించాలని సుదర్శన్‌ సూచించారు.