బుధవారం 27 జనవరి 2021
Mancherial - Nov 05, 2020 , 05:00:55

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

మంచిర్యాల అగ్రికల్చర్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో డిగ్రీ పాసైన నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌ ద్వారా యూపీఎస్సీ, ఎస్సెస్సీ, బ్యాంకింగ్‌, ఆర్‌ఆర్‌బీ, నేషనల్‌ రిక్రూట్‌మెంట్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిలాబాద్‌ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ జీ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ఆదాయం రూ. లక్షా 50 వేలు, పట్టణ ప్రాంత అభ్యర్థులకు రూ. రెండు లక్షల ఆదాయం మించవద్దని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన విద్యార్థులు ఈ నెల 10వ తేదీలోగా ఆన్‌లైన్‌(studycircle.cgg. gov.in)లో దరఖాస్తు చేసుకోవాలన్నా రు. మరిన్ని వివరాలకు 08732221280, 9063965302, 99496 84959లలో సంప్రదించవచ్చని సూచించారు. logo