బుధవారం 27 జనవరి 2021
Mancherial - Nov 04, 2020 , 00:24:46

300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలి

300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలి

మంచిర్యాలటౌన్‌(శ్రీరాంపూర్‌) : మార్చి నెలాఖరు వరకు 300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి, రవాణా చేయాల్సిన బాధ్యత సింగరేణి యాజమాన్యంపై ఉందని సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి సీఅండ్‌ఎండీ, డైరెక్టర్లు 11 ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉత్పత్తికి    కృషి చేయాలని సూచించారు. నవంబర్‌ నెలలో రోజుకు ఉత్పత్తి లక్ష్యం 1.85 లక్షల టన్నులు అని, అంతే మొత్తంలో బొగ్గు రవాణా జరుపాలని పేర్కొన్నారు. ఓసీపీల నుంచి రోజుకు 13.5 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి తొలగించాలన్నారు. ఓసీపీలో నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలన్నారు. కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలవుతుందన్నారు. కేటీకే ఓసీపీ-3 భూపాలపల్లి, ఆడ్రియా ల లాంగ్‌వాల్‌ కొత్తప్యానల్‌ నుంచి డిసెంబర్‌ నెలాఖరుకల్లా బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలని ఆదేశించారు. బొగ్గు ఉత్పత్తిపై, కరోనా నివారణ చర్యలపై చర్చించినట్లు శ్రీరాంపూర్‌ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్లు చంద్రశేఖర్‌, ఫారెస్ట్‌ అడ్వైజర్‌ డీఎన్‌ ప్రసాద్‌, కోల్‌ మూమెంట్‌ ఈడీ కే సురేంద్రపాండే, ఎస్వోటూ జీఎం కుమారస్వా మి, ప్రాజెక్ట్‌ ఆఫీసర్లు పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, డీవైజీఎం చిరంజీవులు పాల్గొన్నారు. 

మందమర్రి రూరల్‌ : సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక జీఎం కార్యాలయం నుంచి కాన్ఫరెన్స్‌లో ఏరియా జీఎం చింతల శ్రీనివాస్‌తోపాటు  గను లు, డిపార్ట్‌మెంట్ల అధికారులు పాల్గొన్నారు.  ఇన్‌చార్జి జీఎం పద్మనాభరెడ్డి, ఇన్‌చార్జి ఎస్వోటూ జీఎం రామ్మోహన్‌రావు, ఎస్కే వోసీ ప్రాజెక్ట్‌ అధికారి వెంకటేశ్వర్లు, ఆర్కేపీ పీవో మధుసూదన్‌, ఇన్‌చార్జి డీజీఎం ఈఅండ్‌ఎం చంద్రశేఖర్‌రెడ్డి, కాసిపేట ఏజెంట్‌ రాజేందర్‌, కేకే ఏజెంట్‌ రాంచందర్‌, హెల్త్‌ ఆఫీసర్‌ లోక్‌నాథ్‌ రెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్‌ రవి, తదితరులు పాల్గొన్నారు. 


logo