బుధవారం 25 నవంబర్ 2020
Mancherial - Nov 01, 2020 , 00:58:56

మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

 మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

హాజీపూర్‌ : మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ పరిపాలనాధికారి సురేశ్‌. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖ అధికారులు పాల్గొన్నారు.  జిల్లా పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జడ్పీ చైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి  వాల్మీకి చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.  అనంతరం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్‌, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు. హాజీపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత వాల్మీకి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

మంచిర్యాల అగ్రికల్చర్‌ :  జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయ ఆవరణలో వాల్మీకి జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్‌ నిర్వహించారు. ముందుగా వాల్మీకి, సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. సిబ్బందితో  డీఈవో వెంకటేశ్వర్లు జాతీయ సమైక్యతా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెక్టోరల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మంచిర్యాల టౌన్‌ : మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేశ్‌ గౌడ్‌, కమిషనర్‌ స్వరూపారాణి, అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, కోఆప్షన్‌ సభ్యులు పూల మాలలు వేసి, నివాళులర్పించారు.

లక్షెట్టిపేట :  స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో  వాల్మీకి చిత్రపటానికి ఎంపీపీ అన్నం మంగ పూలమాలలు వేసి  నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, వైస్‌ ఎంపీపీ దేవేందర్‌ రెడ్డి, సూపరింటెండెంట్‌ దేవేందర్‌ రావు పాల్గొన్నారు.

కోటపల్లి :  ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మంత్రి సురేఖ, ఎంపీడీవో భాస్కర్‌, తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ రామచంద్రయ్య, పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ రాగం రాజక్క, కార్యదర్శి రవళి ఆధ్వర్యంలో వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ లక్ష్మయ్య, ఏపీవో వెంకటేశ్వర్లు, టైపిస్ట్‌ దెందుకూరి శివనాగ సాత్విక్‌, ఆర్‌ఐ రాజలింగు, జూనియర్‌ అసిస్టెంట్‌ కిరణ్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

రామకృష్ణాపూర్‌ : క్యాతనపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌ పర్సన్‌ జంగం కళ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కమిషనర్‌ జీ వెంకటనారాయణ, మేనేజర్‌ నాగరాజు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఈ వసంత్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వీ సంతోష్‌, కౌన్సిల్‌ సభ్యులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

దండేపల్లి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో మేఘమాల, ఎంపీటీసీ ముత్తె రాజన్న, సిబ్బంది పాల్గొన్నారు.

సీసీసీ నస్పూర్‌ : నస్పూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి చైర్మన్‌ ఇసంపల్లి ప్రభాకర్‌, కమిషనర్‌ రాధా కిషన్‌, తదితరులు పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మేనేజర్‌ శ్రీదేవి, జూనియర్‌ అసిస్టెంట్‌ గోవింద్‌, పెద్దింటి మోహన్‌రావు, రఫిక్‌, నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. 

మందమర్రి రూరల్‌ : స్థానిక తహసీల్‌ కార్యాలయంలో వాల్మీకి చిత్ర పటానికి తహసీల్దార్‌ మోహన్‌రెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు.  బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఈ సందర్భంగా బోయ సంఘం నాయకులు బొడ్డు రవి, కుర్రె శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని కోరారు. తిరుపతి, బోగి వెంకటేశ్వర్లు, శ్రీధర్‌, భూకాల సంతోష్‌, ముష్కె వెంకటేశ్‌, ఈశ్వర్‌ పాల్గొన్నారు. 

జన్నారం :  స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎంపీపీ మాదాడి సరోజన, సిబ్బంది పూలమాలు వేసి నివాళులర్పించారు.  ఎంపీవో రమేశ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

వేమనపల్లి : మండలంలోని అన్ని పంచా యతీల్లో సర్పంచ్‌లు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్య క్రమాల్లో సర్పంచ్‌లు మధూకర్‌, బాపు,  దుర్గక్క, ప్రవీణ్‌, జాఫర్‌, మహ్మద్‌ పాల్గొన్నారు. 

బెల్లంపల్లి రూరల్‌ : బెల్లంపల్లి మండల పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ తొంగల సత్యనారాయణ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైస్‌ ఎంపీపీ వీ రాణి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సింగం గణేశ్‌ గౌడ్‌, యువజన సంఘం నాయకులు కాంపెల్లి విశాల్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ కొండయ్య, సతీశ్‌, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

కాసిపేట : మండలంలోని ఆయా ప్రభుత్వ కార్యాలయాలు,పంచాయతీల్లో వాల్మీకి జయంతి నిర్వహించారు. ఆయా పంచాయతీల్లో సర్పంచ్‌ లు, కార్యదర్శులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కన్నెపల్లి : మండల పరిషత్‌ కార్యాలయంలో వాల్మీకి చిత్రపటానికి ఎంపీడీవో శంకరమ్మ పూల మాల వేసి నివాళులర్పించారు. 

తాండూర్‌ : స్థానిక తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కవిత, తాండూర్‌ జీపీలో ఇన్‌చార్జి సర్పంచ్‌ పూదర్‌ నవీన్‌ వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో డిప్యూటీ తహసీల్దార్‌ మాణిక్‌రావు, వీఆర్వోలు, వీఆర్‌ఏలు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, తాండూర్‌ జీపీ కార్యదర్శి తపాస్‌ కుమార్‌, వార్డు సభ్యుడు తిరుపతి, కో ఆప్షన్‌ సభ్యులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.