ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Nov 01, 2020 , 00:58:58

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

  • రూ. 8లక్షల విలువైన సిగరెట్లు స్వాధీనం
  • ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు

ఎదులాపురం: చోరీకి గురైన సిగరెట్‌ ప్యాకెట్ల మిస్టరీని 20 రోజుల్లోనే ఛేదించి అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను  అరెస్టు చేసి నట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం స్థానిక వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన వివరాలను వెల్లడించారు.  అక్టోబర్‌ 8న ఆదిలాబాద్‌ పట్టణంలోని బీ రాములు కాంప్లెక్స్‌లో రూ.8లక్షల విలువైన సిగరెట్‌ బాక్స్‌లు చోరీకి గురైనట్లు  ఐఏ ట్రేడర్స్‌ యజమాని ఇమ్రాన్‌ నుంచి ఫిర్యాదు అందినట్లు తెలిపారు. ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ సీఐ ఈ చంద్రమౌళి ఆధ్వర్యంలో సాంకేతిక బృందం ఇన్‌చార్జి సింగజ్‌వార్‌ సంజీవ్‌ కుమార్‌ ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

దర్యాప్తులో సీసీటీవీ ఫుటేజీ కీలకంగా నిలిచిందని, దాని ద్వారానే నిందితులను గుర్తించినట్లు వెల్లడించా రు. సిగరెట్‌ బాక్స్‌లను మహారాష్ట్రకు తీసుకెళ్తున్న క్ర మంలో లక్ష్మీపూర్‌ చెక్‌ పోస్ట్‌ వద్ద  శనివారం నిం దితులను పట్టుకున్నట్లు తెలిపారు. వీరు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా ముకుంద్‌నగర్‌కు చెందిన ఆరిఫ్‌షేక్‌, సలీం దగుడే పఠాన్‌ అలియాస్‌ సలీం భగవాన్‌, షరాఫత్‌ అలీని అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.  ప్రధాన నిందితులు మోమిన్‌ సోహెల్‌ అలియాస్‌ షేక్‌ సోహెల్‌, కమలేశ్‌ పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. వన్‌టౌన్‌ సీఐ కే రామకృష్ణ, టాస్క్‌ఫోర్స్‌ సీఐ చంద్రమౌళి, ఎస్‌ఐ జీ. అప్పారావు, సిబ్బంది ఎస్కే తాజుద్దీన్‌, రమేశ్‌, హనుమంతరావు, ఠాకూర్‌ జగన్‌ సింగ్‌, సీసీటీఎన్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి సిం గజ్‌ వార్‌ సంజీవ్‌ కుమార్‌, రియాజ్‌ ఉన్నారు.