బుధవారం 25 నవంబర్ 2020
Mancherial - Oct 31, 2020 , 00:44:09

రూ. 1.25 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం

రూ. 1.25 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం

  • మంచిర్యాల నుంచి జీఎం ఆఫీస్‌ వరకు  రోడ్డు విస్తరణ 
  • సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు 
  • ఎమ్మెల్యే దివాకర్‌రావు

సీసీసీ నస్పూర్‌ :  నస్పూర్‌ మున్సిపాలిటీ పరిధి నస్పూర్‌, సీతారాంపల్లి పరిధిలోని వాగుపై 1.25 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్డి నిర్మిస్తున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌ రావు తెలిపారు.  వాగుపై హై లెవల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు గ్రామాలను కలుపుతున్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు  తెలిపారు. మంచిర్యాల నుంచి జీఎం ఆఫీస్‌ వరకు రహదారి విస్తరణతో పాటు డివైడర్‌ నిర్మాణం చేపట్టి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. జీఎం ఆఫీస్‌ నుంచి ఎంఎన్‌ఆర్‌ గార్డెన్‌ వరకు బైపాస్‌ రోడ్డు నిర్మించనున్నట్లు చెప్పారు.

నస్పూర్‌ మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ ఇసంపెల్లి ప్రభాకర్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, కౌన్సిలర్లు జబీన్‌ హైమద్‌, కే అన్నపూర్ణ, బండి పద్మ, బోయ మల్లయ్య, పంబాల గంగ, కో ఆప్షన్‌ సభ్యులు ముత్తె రాజేశం, పెరుమాళ్ల భాగ్యలక్ష్మి, సయ్యద్‌ ఖాసీం, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు వొడ్నాల రాయమల్లు, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అన్నయ్య, కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు రాచకొండ గోపాల్‌రావు, జక్కుల రాజేశం, కమిషనర్‌ రాధాకిషన్‌, ఆర్‌ అండ్‌బీ డీఈ బహుసింగ్‌, నాయకులు ఆకునూరి సంపత్‌, దగ్గుల మధు, బాగం నగేశ్‌, ముక్కెర వెంకటేశ్‌, భానుచందర్‌, దెబ్బటి రామన్న, జాబ్రీ గౌస్‌, వడ్లూరి రవి, గర్శె భీమయ్య, అక్కూరి సుబ్బయ్య పాల్గొన్నారు.