శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mancherial - Oct 31, 2020 , 00:44:12

ఎమ్మెల్సీ కవితను కలిసిన నాయకులు

ఎమ్మెల్సీ కవితను కలిసిన నాయకులు

మందమర్రి / మంచిర్యాల టౌన్‌ (శ్రీరాంపూర్‌): ఎమ్మెల్సీగా పదవీ బాద్యతలు స్వీకరించిన చేసిన కల్వకుంట్ల కవితను సింగరేణిలోని అన్ని డివిజన్ల టీబీజీకేఎస్‌ సోషల్‌ మీడియా సభ్యులు శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  ఎమ్మెల్సీ కవిత 11 ఏరియాల్లోని టీబీజీకేఎస్‌, టీఆర్‌ఎస్‌ నుంచి సోషల్‌ మీడి యా ఆర్గనైజర్లను ఎంపిక చేసి హైదరాబాద్‌కు ఆహ్వానించారు. ఏరియా చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పిట్‌ కార్యదర్శి మహేందర్‌రెడ్డి, నీలం సదయ్య, నాయకులు అన్వేశ్‌ రెడ్డి, అజీజ్‌, రత్నాకర్‌రెడ్డి ఎమ్మెల్సీకి శుభాకాంక్షలు తెలిపా రు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, సింగరేణి సంస్థలో సీఎం కేసీఆర్‌ కల్పించిన ప్ర యోజనాలపై సోషల్‌ మీడియా ద్వారా వివరించాలని చెప్పారు. 

తాండూర్‌ /రెబ్బెన :  ఎమ్మెల్సీగా బాధ్యత లు స్వీకరించిన కల్వకుంట్ల కవితను టీబీజీకేఎస్‌ బెల్లంపల్లి ఏరియా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాసరావు, టీబీజీకేఎస్‌ నాయకులు మంగీలాల్‌, అబ్బు శ్రీనివాసరెడ్డి, మాంతు సమ్మయ్య, సత్యనారాయణ   ఉన్నారు.

కాగజ్‌నగర్‌టౌన్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జాగృతి కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా అధ్యక్షుడు పర్శ చంద్రశేఖర్‌ భార్య జ్యోతి, కూతురు సుప్రజ కలిశారు. ఆమెకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట మాజీ జడ్పీటీసీ రామ్‌నాయక్‌ ఉన్నారు.