శనివారం 28 నవంబర్ 2020
Mancherial - Oct 30, 2020 , 01:00:43

ఆస్తుల నమోదును వేగవంతం చేయాలి

ఆస్తుల నమోదును వేగవంతం చేయాలి

  • అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి

మంచిర్యాలటౌన్‌ : ధరణి సర్వేలో భాగంగా ఆస్తుల నమోదు ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపా ఠి మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. మంచిర్యాల మున్సిపల్‌ అధికారులు, సిబ్బందితో గురువారం అదనపు కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఆస్తుల సర్వే వివరాల నమోదులో 91 శాతం పూర్తయిందని, ఇంకా మిగిలిఉన్న 2 వేలకు పైగా ఇండ్లను సర్వే చేయాలని సూచించారు.  న్యూ అసెస్‌మెంట్లు ఆన్‌లైన్‌ చేయాలని నిర్ణయించామ ని, ఆ మేరకు సర్వే చేయాలని పేర్కొన్నారు. వీధి వ్యాపారులకు అందించే రూ. 10 వేల రుణా న్ని అర్హులైన వారందరికీ అందేలా చూడాలని సూచిం చారు. మున్సిపల్‌ కమిషనర్‌ జీ స్వరూపారాణి, ఎంఈ సుమతి, ఏఈ నర్సింహస్వామి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.