శనివారం 28 నవంబర్ 2020
Mancherial - Oct 30, 2020 , 01:00:40

వారోత్సవాలను విజయవంతం చేయండి

వారోత్సవాలను విజయవంతం చేయండి

మంచిర్యాల అగ్రికల్చర్‌ : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని పురస్కరించుకొని న వంబర్‌ రెండు నుంచి ఏడో తేదీ వరకు పాఠశాల ల్లో రాష్ట్రీయ ఆవిష్కార్‌ వారోత్సవాలను విజయవంతం చేయాలని డీఈవో వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలోని సైన్స్‌ ఉపాధ్యాయులకు గురువారం నిర్వహించిన ఆన్‌లైన్‌ అవగాహన కార్యక్రమంలో డీఈవో మాట్లాడారు. 48 పాఠశాలల్లో ఆవిష్కార్‌ వారోత్సవాలను ప్రధానోపాధ్యాయులు, సైన్స్‌ ఉపాధ్యాయులు కలిసి విజయవంతం చేయాలని కోరా రు. సెక్టోరల్‌ అధికారులు శ్రీనివాస్‌, పద్మజ, జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, ఎన్‌జీసీ కోఆర్డినేటర్‌ గుండేటి యోగేశ్వర్‌, జిల్లా రిసోర్స్‌ పర్సన్‌ శ్రీమూర్తి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

పాఠశాలల తనిఖీ..

కాసిపేట : మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌, కసూర్బా, ముత్యంపల్లి, కాసిపేట సెకండరీ, ప్రైమరీ పాఠశాలలను డీఈవో ఎస్‌ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆన్‌లైన్‌ విద్యాబోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాసిపేటలోని మోడల్‌ స్కూల్‌లో ప్ర వేశానికి నిర్వహించిన పరీక్షా కేందా న్ని తనిఖీ చేశారు. పరీక్షకు 9వ తరగతికి 16 మం ది దరఖాస్తు చేసుకోగా ఐదుగురు హాజరయ్యారు. 10వ తరగతికి ఇద్దరు విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా ఒక్కరే హాజరయ్యారు. డీఈవో వెంట సెక్టోరియల్‌ ఆఫీసర్‌ సఫ్దర్‌ అలీ ఖాన్‌, సీఎస్‌ అందె నాగ మల్లయ్య, డీవో రాథోడ్‌ రమేశ్‌ ఉన్నారు.