ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 29, 2020 , 02:16:49

అప్రమత్తతే పక్షవాతానికి మందు

అప్రమత్తతే పక్షవాతానికి మందు

 • మారుతున్న జీవన విధానమే వ్యాధి వ్యాప్తికి కారణం 
 • రోజువారీగా 20-30 మంది  బాధితులు..
 • న్యూరాలజిస్ట్‌ల వద్ద  పెరుగుతున్న కేసులు
 • నేడు ప్రపంచ పక్షవాత నివారణ దినం 

మంచిర్యాల అగ్రికల్చరల్‌ : పక్షవాతం ఈ పదం విన్న వింటేనే కాళ్లు, చేతులు ఆడనంత పనవుతుం ది. ఎంతో ఉత్సాహంతో ఉన్న వారిని కూడా ఇట్టే చతికిల పడేస్తుంది. అతి టెన్షన్‌, మారిన ఆహార అలవాట్లతోనూ.. వ్యాయామం లేకుండా నిత్యం బిజీగా గడిపే వారిలోనూ పక్షవాతం (పెరాలసిస్‌) వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమస్యతో బాధ పడేవారు ప్రతిరోజూ 20-30 మంది వరకు న్యూ రాలజిస్ట్‌ను సంప్రదిస్తున్నారు. దేశంలో యేటా 15 లక్షల మంది పక్షవాతం (పెరాలసిస్‌) బాధితులు  ఉంటారని అంచనా. ప్రస్తుతం మహిళల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తున్నది. నేడు పక్షవాత నివారణ దినం సందర్భంగా ప్రత్యేక కథనం.. 

పక్షవాతం (పెరాలసిస్‌) వ్యాధి రోజురోజుకూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఈ వ్యాధి బారి న పడుతున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరిగిపో తున్నది. బతికి ఉండగానే జీవచ్ఛవంలా మార్చే ఈ వ్యాధి నివారణకు ముందు జాగ్రత్తలే శరణ్యమని వైద్యులు చెబుతున్నారు.  

పక్షవాతం అనగా..

మనిషిలోని ముఖ్యమైన అవయవాల్లో మెదడు కూడా ఒకటి, శరీరాన్ని నడిపేది ఈ మెదడే. మెదడులో చిన్న సమస్య తలె త్తినా బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది. అదే పక్షవాతం లక్షణం. దీని వల్ల శరీరం లో అవయవాలు అదుపు తప్పుతాయి. కాళ్లు, చేతులు పనిచేయకుండా పోతాయి. మనిషి ది వ్యాంగుడిగా మారుతాడు. 

 ఇందులో రకాలు..

 • మెదడులో రక్తనాళాల్లో రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడం వల్ల శరీరంలో కొన్ని భాగాలు చచ్చు బడి పోతాయి. దీనిని ఇస్కిమిక్‌  స్ట్రోక్‌ అంటారు.
 • మెదడులో రక్తనాళాలు చిట్లినప్పుడు అంతర్లీ నంగా రక్తస్రావం జరుగుతుంది. దీనిని హెమరేజిక్‌  స్ట్రోక్‌  అంటారు.

ఎందుకు వస్తుంది..

వయస్సు పెరగడం, వారసత్వం, మద్య పానం, ధూమపానం, పని ఒత్తిడి వల్ల పక్షవాతం వస్తుంది. ఇంకా డయాబెటీస్‌ (మధుమేహం), రక్తపోటు (బీపీ) స్థూలకాయం సమస్యలు ఉంటే ప్రమాదం పొంచి ఉన్నట్లే. ఒత్తిడికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. 

రాకుండా జాగ్రత్తలు..

 • బీపీ (రక్తపోటు), మధుమేహం (డయాబెటీస్‌) ను అదుపులో ఉండేలా చూసుకోవాలి. 
 • బరువు పెరగకుండా వ్యాయామం యోగా చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకోవాలి. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలి. 

వ్యాధి తీవ్రత..

పక్షవాతం వల్ల సెకన్‌కు 32వేల న్యూరాన్లు, నిమిషానికి 19 లక్షల న్యూరాన్లు చనిపోయి మెద డుకు సంబంధించిన ప్రసరణ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పక్షవాతంతో మరణిస్తున్న దేశాల జాబితాలో మన దేశం రెండో స్థానం. ఇది వచ్చిన ప్రతి ముగ్గురిలో ఒకరు శాశ్వ తంగా అంగవైకల్యం బారిన పడుతున్నారు. పక్షవా తం ప్రతి ఆరుగురిలో ఒక్కరికి వస్తుంది.

గుర్తించడం ఎలా..

 • మాటలు ముద్దగా రావడం.
 •  కాలు, చెయ్యి బలహీనంగా మారడం.
 • మతిమరుపు రావడం.
 • సరిగ్గా నడవలేక పోవడం.

తక్షణమే స్పందించాలి..

పక్షవాతం లక్షణాలను గుర్తించిన మూడు గంట ల్లోగా సరైన వైద్యం (మెదడుకు రక్తప్రసరణ) అం దించగలిగితే వారిని కాపాడవచ్చు. నిపుణు లైన డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందిస్తారు.

 బీపీ, షుగర్‌ అదుపులో ఉంచుకోవాలి

పక్షవాతం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. రక్తపోటు, షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. దీంతో పక్షవాతం రాకుండా కాపాడుకోవచ్చు. పక్షవాతం వచ్చిన వారు మూడు, నాలుగు గంటల్లోపు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.

- తిరుమల్‌ రావు ఎంబీబీఎస్‌ (జనరల్‌ మెడిసిన్‌) డీ ఎం (న్యూరాలజీ)