ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 29, 2020 , 02:16:52

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి

  • మంచిర్యాల ఇన్‌చార్జి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • బాధ్యతల స్వీకరణ

హాజీపూర్‌ : ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని మంచిర్యాల జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ సూచించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా  బుధవారం ఆమె బాధ్యతలను స్వీకరించారు.  తొలిసారిగా మంచిర్యాల కలెక్టరేట్‌కు వచ్చిన ఆమెకు అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, జిల్లా అధికారులు  పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడారు. పల్లె ప్రగతి, రైతు వేదికలు, సీఎంఆర్‌ఎఫ్‌, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఆధ్వర్వంలో అభివృద్ధి పనులు పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు.