ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 28, 2020 , 02:13:13

అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దుదాం

అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దుదాం

మంచిర్యాల టౌన్‌(శ్రీరాంపూర్‌) : సింగరేణిని అవినీతి రహిత సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఉ ద్యోగి, కార్మికుడు, అధికారి కృషిచేయాలని శ్రీరాంపూర్‌ జీఎం కందుకూరి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్‌లోని ఓసీపీ, జీఎం కార్యాలయ ఆవరణలో మంగళవారం సింగరేణి విజిలె న్స్‌ అవగాహన వారోత్సవాలను నిర్వహించారు. ‘నిజాయతీ-ఒక జీవన శైలీ’ నినాదంతో జీఎం లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రాజెక్టు అధికా రి పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో జీఎం లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్‌ ఉపాధ్యక్షుడు కే సురేందర్‌రెడ్డి.. ఓసీపీపై జీఎం కార్యాలయ సిబ్బందితో ప్రతి జ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. నవంబర్‌ 2వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ‘అప్రమత్తమైన భారత దేశం-సంపన్న భారత దేశం’ అనే నినాదంతో ఈ ఏడాది వారోత్సవాలు జరుపుతున్నట్లు చెప్పారు. కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూ డా బొగ్గు వెలికి తీసి దేశ పారిశ్రామికాభివృద్ధికి కృ షిచేస్తున్న కార్మికులను అభినందించారు.  అనంతరం ‘స్వచ్ఛతా మహా-2020’లో భాగంగా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం కుమారస్వామి, డీవైజీఎం గోవిందరాజు, ఓసీపీ మేనేజర్‌ జనార్దన్‌, టీబీజీకేఎస్‌ డి ప్యూటీ ప్రధాన కా ర్యదర్శి దీకొండ అన్న య్య, డీవైజీఎం చిరంజీవి, శ్రీనివాస్‌, రమేశ్‌, పిట్‌ కార్యదర్శి పెంట శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు, ఈఈ ర వీందర్‌, డీవైపీఎం తుకారాం, స్పోర్ట్స్‌ సూపర్‌వైజర్‌ అశోక్‌, నాయకులు రాజన్న పాల్గొన్నారు. 

ఎస్‌ఆర్పీ 3, ఆర్కే 6, ఆర్కే 7పై.. 

శ్రీరాంపూర్‌ ఆర్కే7పై మేనేజర్‌ గోసిక మల్లేశం, సేఫ్టీ అధికారి వెంకటేశ్‌ ఆధ్వర్యంలో.., ఆర్కే న్యూటెక్‌ గనిపై మేనేజర్‌ రాజ్‌కుమార్‌, సేఫ్టీ అధికారి అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో.., ఆర్కే 6 గని మేనేజర్‌ సంతోష్‌కుమార్‌, సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో.., అలాగే ఎస్‌ఆర్పీ 3 గనిఫై మేనేజర్‌ రవికుమార్‌, సేఫ్టీ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్‌ వారోత్సవాలను నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డిప్యూటీ మేనేజర్‌ రాందాస్‌, సీనియర్‌ పీవో శ్యాంసుందర్‌, టీబీజీకేఎస్‌ చర్చల ప్రతినిధి వెంగళ కుమారస్వామి, పోశెట్టి, బ్రాంచి కార్యదర్శి పానగంటి సత్తయ్య, ఆర్కే7 గనిపై సీనియర్‌ పీవో శివకుమార్‌, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి మెండ వెంకటి, ఆర్కే న్యూటెక్‌ గనిపై సీనియర్‌ పీవో గుండు రాజు, టీబీజీకేఎస్‌ పిట్‌ కార్యదర్శి పీ శ్రీరాములు, గోపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.