సోమవారం 30 నవంబర్ 2020
Mancherial - Oct 28, 2020 , 02:13:47

శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు

శరవేగంగా రోడ్డు విస్తరణ పనులు

చెన్నూర్‌ టౌన్‌ : పట్టణంలోని జలాల్‌ పెట్రోల్‌ బంక్‌ నుంచి అం బేద్కర్‌ చౌరస్తా వరకు రూ.10 కోట్లతో చేపట్టిన నాలుగు లైన్ల ప్రధాన రహదారి విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వ విప్‌ సుమన్‌ చొరవతో విశాలమైన రహదారులు, ధగధగలాడే సెంట్రల్‌ లైటింగ్‌, మిరుమిట్లు గొలిపే ఫౌం టెయిన్లు, డివైడర్ల మధ్య ఆహ్లాదకరమైన మొక్కలు, ప్రధాన రహదారికి ఆనుకొని పచ్చని పార్కు, ఇరువైపు లా కాలువలు, మిషన్‌ భగీరథ పైపులైన్లు, విద్యుత్‌ స్తం భాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో త్వరలోనే పట్ట ణం కొత్త శోభను సంతరించుకోనున్నది. ఎమ్మెల్యే సుమన్‌ సహకారంతో సిద్దిపేట, సిరిసిల్లకు దీటుగా రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దేలా పనులు సాగుతున్నాయని చైర్‌ పర్సన్‌ అర్చనా గిల్డా, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ సభ్యులు పేర్కొన్నారు.