శుక్రవారం 04 డిసెంబర్ 2020
Mancherial - Oct 27, 2020 , 02:54:00

పండుగ రోజు తీవ్ర విషాదం

 పండుగ రోజు తీవ్ర విషాదం

  • మునిగిన నాటు పడవ
  • గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పడుతుండగా ఇద్దరు మృతి 
  •  మరో ముగ్గురిని కాపాడిన స్థానికులు
  •  గాలింపు చర్యలను పర్యవేక్షించిన జైపూర్‌ ఏసీపీ నరేందర్‌
  •  కన్నీరుమున్నీరవుతున్న  కుటుంబ సభ్యులు

చేపలు వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డ ఘటన ఆదివారం భీమారంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి ఈరవేణ రాజబాపు (28), బొంతల రమేశ్‌ (36), తమ బంధువులతో కలిసి గొల్లవాగు ప్రాజెక్టులో చేపలు పడుతుండగా, నాటు పడవ మునిగింది. ఇద్దరు గల్లంతు అవగా రెస్యూ టీం, గజ ఈతగాళ్లు మృతదేహాలను వెలికితీశారు. పండుగ పూట ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా, కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.  ముగ్గురిని కాపాడిన ఇద్దరు యువకులను  పోలీసులు అభినందించారు.

- భీమారం

భీమారం : మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రానికి చెందిన  బొంతల రమేశ్‌ (38) , ఈరవేణ రాజబాపు (28) , సుంకరి సంపత్‌తో పాటు వరసకు బావలు అయిన పెద్దపల్లి జిల్లాకేంద్రానికి చెందిన మచ్చ రవి , పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన కలవేణ రమేశ్‌ శనివారం సద్దుల బతుకమ్మకు  మండల కేంద్రానికి (అత్తగారిండ్లకు) వచ్చారు. ఆదివారం గొల్లవాగు ప్రాజెక్ట్‌లో చేపలు పట్టేందుకు నాటు పడవలో వెళ్లారు. కొంతసేపటి తర్వాత పోతన్‌పల్లి ఒ డ్డుకు చేరుకొని సేద తీరారు. అనంతరం పట్టుకున్న చేపలతో మధాహ్నం 3 గంటల ప్రాం తంలో తిరుగు పయనం కాగా , నాటు పడవ ఒ క్కసారిగా బోల్తాపడింది. దీంతో ఈరవేణ రాజబాపు , బొంతల రమేశ్‌ మునిగిపోయారు. సుంకరి సంపత్‌ చెట్టుని పట్టుకోగా, మరో ఇద్దరు కలవేణి రమేశ్‌ , మచ్చ రవి మునిగిన నాటు పడవని పట్టుకుని తమను కాపాడాలంటూ అరిచారు. అ క్కడే పత్తి చేనులో పని చేస్తున్న లం బాడీతండాకు చెందిన బానోత్‌ రాజేందర్‌ గమనించి బంధువులకు సమాచారం అందించారు. దీంతో సుంకరి వెంకటేశ్‌ సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. పో లీస్‌లకు సమాచారం ఇవ్వడంతో శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌ , శ్రీరాంపూర్‌, స్థానిక ఎస్‌ఐలు కావత్‌ మంగీలాల్‌ , బర్ల సంజీవ్‌ సహాయక చర్య లు చేపట్టారు. ఆదివారం గోదావరిఖని రెస్క్యూ టీం , మంచిర్యాల ఫైర్‌ రెస్యూ టీం , వేమనపల్లి జ లార్లు సైతం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. జైపూర్‌ ఏసీపీ నరేందర్‌తో పాటు , ఆ ర్డీవో రమేశ్‌ జాలర్లకు పలు సూచనలు చేశారు. సో మవారం సాయంత్రం 5 గంటలకు ఈరవేణి రా జబాపు , అనంతరం బొం తల రమేశ్‌ల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో ఒక్కసారిగా కుటంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.  బొంతల రమేశ్‌కు భార్య భాగ్యలక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు , కూతురు ఉన్నారు. రాజబాపునకు భార్య శ్రావణి ఉంది.

ముగ్గురిని కాపాడిన యువకులు

  • అభినందించిన పోలీసులు

భీమారం : నాటు పడవ మునిగిన ఘటనలో బానోత్‌ రాజేందర్‌తో పాటు సుంకరి వెంకటేశ్‌ ముగ్గురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. వీరిని శ్రీరాంపూర్‌ సీఐ బిల్లా కోటేశ్వర్‌ అభినందించా డు. సంఘటనా స్థలాన్ని వైస్‌ ఎంపీపీ జలంపల్లి సమ్మయ్య , సర్పంచ్‌ గద్దెరాంరెడ్డి , టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపోటు రాజేశ్వర్‌ రెడ్డి , చెన్నూర్‌ నియోజక వర్గ యూత్‌ అధ్యక్షుడు వేముల శ్రీకాంత్‌ గౌడ్‌ , రైతు బంధు సమితి మండల కోర్డినేటర్‌ కలగూర రాజ్‌ కుమార్‌, యూత్‌ మండల అధ్యక్షుడు ఆవుల సురేశ్‌ యాదవ్‌ , మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు పెం డ్యాల మధూకర్‌, మండల నాయకులు పో డెటి రవి , నల్లాల రాజలింగు , కట్టనాగరాజు , పరిశీలించారు.