శనివారం 28 నవంబర్ 2020
Mancherial - Oct 27, 2020 , 02:54:02

నవంబర్‌ 1న టీజీ సెట్‌ 5 తరగతి ప్రవేశ పరీక్ష

నవంబర్‌ 1న టీజీ సెట్‌  5 తరగతి ప్రవేశ పరీక్ష

బెల్లంపల్లిరూరల్‌ : నవంబర్‌ 1న సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షే మ, జనరల్‌ గురుకుల విద్యాలయాల్లో  టీజీ సెట్‌ 5 వ తరగతి ప్రవే శం కోసం తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (2020) నిర్వహిం చను న్నట్లు సంక్షేమ బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్‌ ఐనాల సైదు లు తెలిపారు. మంచిర్యాల జిల్లాలో 12 కేంద్రాల్లో  ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహి స్తారని పేర్కొన్నారు. పరీక్ష రాసే విద్యార్ధులు www.tswreis.in, http/ tgcet.cgg. gov.in, http/tgtwgurukulam. telangana. gov.in, hrtp/ mjptbcwreis.cgg.gov.in, hrtp/mjp tbcwreis. telangana.gov.in, http/tresidential.gov.in వెబ్‌సైట్ల నుంచి అక్టోబర్‌ 31 వరకు తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొవి డ్‌-19 నిబంధనలకు అనుగుణంగా పరీక్ష కేంద్రాల వద్దకు గంట ముందుగా చేరుకోవాలన్నారు.సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. హాల్‌ టికెట్‌తో పాటు, పరీక్ష ప్యాడ్‌, బ్లాక్‌/బ్లూ బాల్‌ పాయింట్‌ పెన్‌ను వెంట తెచ్చుకోవాలని సూచించారు.