మంగళవారం 01 డిసెంబర్ 2020
Mancherial - Oct 27, 2020 , 02:54:06

ప్రతి కూలీకి ఉపాధి

ప్రతి కూలీకి ఉపాధి

  • గ్రామాలవారీగా సభలు నిర్వహిస్తున్న అధికారులు
  • నవంబర్‌ 30లోగా పూర్తి 
  • ఉపాధి హామీ పనులకు మార్గదర్శకాలు జారీ

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతికూలీకి పని కల్పించాలని సర్కారు భావిస్తున్నది. గ్రామసభల నిర్వహణ, సర్వే, డాక్యుమెంట్ల తయారీ, ప్రణాళికల రూపకల్పన, ఆమోదం వంటి విషయాలపై స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇందుకోసం ప్రజల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించేలా చర్యలు తీసుకుం టున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామాలవారీగా గ్రామసభలు కూడా కొనసాగుతున్నాయి. గుర్తించిన పనులను గ్రామసభల్లో వెల్లడించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

 - మంచిర్యాల, నమస్తే తెలంగాణ

(మంచిర్యాల, నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ పనులకు సం బంధించి రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీ చేసిం ది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి కూ లీకి పని చూపించేలా ప్రణాళికలు రూపొందించాలన్న ఆదేశాల మేరకు అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు. 

పెద్ద ఎత్తున పనుల కల్పన..

తెలంగాణ ప్రభుత్వం ప్రతి కూలీకి ఉపాధి హామీ పని కల్పించేలా చర్యలు తీసుకుంటున్నది. ఉపాధి హామీ కింద ఎన్నో పనులు చేసుకునే వీలుంటుంది. కానీ గత పాలకులు పట్టించుకోలేదు. కానీ సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి పనుల కల్పనతో పాటు గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలని ఆదేశించారు. దీంతో ఇప్పటికే నర్సరీలు, మొక్కల పెం పకం, కాల్వల మరమ్మతులు, పూడికతీత, వైకుంఠధామా లు, డంపు యార్డులు, అంతర్గత రోడ్లు,  అంగన్‌వాడీ కేం ద్రాలు, పాఠశాలల్లో మరుగుదొడ్లు, కల్లాల నిర్మాణం, వ్యవసాయ భూములు చదును చేసుకునే పనులు, పంట చేలకు ట్రెంచ్‌ నిర్మాణం, ఇంకుడుగుంతలు, పశువులు, కోళ్ల పెంపకానికి షెడ్ల నిర్మాణాలు ఇలా ఎన్నో పనులు ఉపాధి హామీ పథకం ద్వారా చేయిస్తున్నారు. 

గ్రామ సభల షెడ్యూల్‌..

గ్రామ సభల నిర్వహణ, సర్వే, డాక్యుమెంట్ల తయారీ, ప్ర ణాళికల రూపకల్పన, ఆమోదం వంటి విషయాలపై ప్రభు త్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నవంబర్‌ 30 వర కు గ్రామాల వారీగా ప్రత్యేక సభలు నిర్వహించి లేబర్‌ బ డ్జెట్‌ తయారీ, ఆమోదం, బడ్జెట్‌కు అనుగుణంగా పనులు గుర్తించి ఆమోదం తీసుకోవడం లాంటి ప్రక్రియ చేపట్టాలి. ఆమోదించిన ప్రణాళికలు ఈ ఏడాది డిసెంబర్‌ 5 లోగా ఏపీవో, ఈసీ, పంచాయతీ కార్యదర్శులు మండల పరిషత్‌ ఆమోదం కోసం పంపించాలి. అక్కడ ఆమోదించిన పనుల ప్రణాళికలు డిసెంబర్‌ 20లోగా జిల్లా  పరిషత్‌కు పంపించాల్సి ఉంటుంది.  ఇవన్ని పూర్తయిన తర్వాత తుది ప్రణాళిక పూర్తి చేయాలి. జనవరి 21 వరకు జిల్లా ప్రణాళిక పూర్తి చేసి కలెక్టర్‌కు ప్రజెంటేషన్‌ ఇచ్చి అదే రోజు ఆమోదం పొం దాలి. ఆ తర్వాత దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి జనవరి 31 లోపు పంపించాలి. ఫిబ్రవరి 10 లోగా రాష్ట్ర ప్రభుత్వం ద్వా రా కేంద్రానికి ఆమోదం కోసం పంపించాల్సి ఉంటుంది.

 ఇదీ ప్రణాళిక ముఖ్య ఉద్దేశం.. 

2020-21లో చేపట్టిన పనుల సమగ్ర ప్రగతి నివేదికను గ్రామ సభలో పంచాయతీ కార్యదర్శి చదివి వినిపించాలి. సహజ వనరుల కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందించడం, గ్రామాల్లోని కూలీలు, రైతులను ప్రణాళికలో భాగస్వాములను చేయాలి. స్వయం  సహాయక సంఘాల నుంచి చురుకుగా ఉన్న ఇద్దరు సభ్యులను సోషల్‌ ఆడిట్‌ గురించి ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రణాళిక అమలు కోసం గ్రామంలో పర్యవేక్షణ కమిటీ బాధ్యత వహించేలా చూడాలనేది ప్రణాళిక ముఖ్య ఉద్దేశం. అదే విధంగా గ్రామాల్లో పచ్చదనం, శుభ్రత గురించి అవగాహన కల్పించాలి. గ్రామ పారిశుధ్యం, ఇంకుడుగుంతలు తదితరాల వాటిపై అవగాహన కల్పించి గ్రామ ప్రణాళిక రూపొందించాల్సి ఉంటుంది. 

 ప్రతి కూలీకి పని ..

 జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. జాబ్‌ కార్డు గల ప్రతి కూలీకి పని కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ మేరకు గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నాం. ప్రజలు కోరిన పనులే చేపడుతాం. ఈ మేరకు గ్రామ, మండల తీర్మానాల ఆమోదంతో ముందుకు సాగుతాం. 

- ఏపీవో మల్లేశం