ఆదివారం 29 నవంబర్ 2020
Mancherial - Oct 24, 2020 , 02:09:39

కార్మికులకు పండుగ శుభాకాంక్షలు

కార్మికులకు పండుగ శుభాకాంక్షలు

  •  లేఖల ద్వారా తెలిపిన సీఅండ్‌ఎండీ

శ్రీరాంపూర్‌ : సింగరేణి కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు సీఅండ్‌ఎండీ శ్రీధర్‌ వ్యక్తిగత లేఖల ద్వారా దసరా, దీపావళి పండుగల శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు సంతోషంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. సింగరేణి సంస్థ 2019-20 లాభాల్లో కార్మికులకు రూ.993.86 కోట్లలో సీఎం కేసీఆర్‌ ఆదేశం మేరకు కార్మికులకు 28 శాతంతో రూ.278.28 కోట్లు వాటా బోనస్‌గా పంపిణీ చేశామని తెలిపారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు పరిశ్రమకు దేశంలోనే నంబర్‌ 1 ప్రభుత్వ రంగ పరిశ్రమగా గుర్తింపు ఉందని, కానీ కరోనాతో ఉత్పత్తికి ఆటంకం కలిగిందని పేర్కొన్నారు. మిగిలిన 5 నెలల కాలంలో 300 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాల్సి ఉందన్నారు. ఇందుకు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.